రాష్ట్రం మరో బీహార్
రాష్ట్రం మరో బీహార్‌లా మారుతోంది.
బీహార్‌లో ఒకప్పుడు సామాన్యుడు బతకాలంటే కష్టం. ఇళ్ళు వదిలి బయటకు వెళితే
తిరిగి వచ్చే సరికి ఏమౌతుందో తెలియని పరిస్థితి. అక్కడి నేరస్థుల వెనుక
రాజకీయ పార్టీల నేతల అండదండలు పుష్కలంగా ఉండటం వల్లే నేరాల సంఖ్య దేశం
ఆందోళన చెందే విధంగా పెరిగింది. అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం
ప్రజా ప్రతినిధులే నేరుగా నేరాలకు పాల్పడుతూ జైళ్ళ పాలవుతున్నారు. నేతల
తీరు, ధనదాహం, వ్యవహార శైలి పట్ల సామాన్య ప్రజలు ఈసడించుకుంటున్నారు.
రాజకీయాలంటే అక్రమార్జన, దౌర్జన్యాలు, అడ్డువచ్చిన వారిని అంతం చేయడం,
హింసను ప్రేరేపించడమేనా అని నిలదీసే స్థాయికి ప్రజలు ఎదిగేందుకు అన్ని
పార్టీలు తోడ్పాటును అందిస్తున్నాయి. కొంత మంది విధి నిర్వహణలో తప్పులు
చేసి ఆ తర్వాత దర్యాప్తు సంస్థలకు దొరికిపోతే మరికొంత మంది తెలిసి తెలిసీ
తప్పులు చేస్తూ జైలుకు వెళ్తున్నారు. రాష్ట్రంలో కొన్నాళ్ళ క్రితం వరకు
కళంకిత మంత్రులు ఉండగా, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు
కూడా వారికి తోడయ్యారు. అవినీతి, అక్రమాల విషయంలో కాంగ్రెస్‌తో పాటు
టీడీపీ, వైఎస్సార్ సీపీ, టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు కూడా పోటీ
పడుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు వరుస కట్టి జైలుకు
వెళ్తుండటంతో చంచల్‌గూడ జైలు విఐపీ ఖైదీలకు కేంద్రంగా తయారైంది. దీంతో జైలు
వద్ద సందర్శకుల రద్దీ పెరుగుతోంది. ఎవరిని కలిసేందుకు ఎవరు వస్తున్నారు,
వారు ఏం మాట్లాడుకున్నారు అన్న విషయాలు తెలుసుకునేందుకు మీడియా హడావిడి
కూడా బాగా పెరిగింది. ప్రధాన రహదారిపై మీడియా వాహనాలు, మీడియా ప్రతినిధుల
హడావిడి పెరగడంతో చివరకు జైలు ముందు ఉన్న రహదారిని పూర్తిగా మూసి వేయాలన్న
నిర్ణయానికి అధికారులు వచ్చారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో
స్పష్టమవుతోంది.
రాష్ట్రాన్ని అయిదేళ్ళ పాటు పాలించి రెండవ పర్యాయం తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తీసుకున్న నిర్ణయాలలో కొన్ని చట్ట విరుద్ధంగా ఉన్నాయన్న ఆరోపణలతో వాటిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ సుదీర్ఘంగా దర్యాప్తు చేసి నిగ్గు తేల్చింది. దీంతో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జైలు జీవితాన్ని గడపాల్సి వస్తోంది. జగన్ అక్రమార్జనకు సహకరించారన్న అభియోగంపై మంత్రిగా పని చేసిన మోపిదేవి వెంకటరమణారావు జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈయనతో పాటు ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, జె. గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మినారాయణలు కళంకిత మంత్రులన్న ఆరోపణలను ఎదుర్కుంటున్నారు. మరో మంత్రి దానం నాగేందర్‌పై బంజారాహిల్స్ దేవాలయం భూ విషయంలో కేసు విచారణ సాగుతోంది. ఏ క్షణంలోనైనా కోర్టు ఎదుట హాజరవాల్సి ఉంది. అధికారాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశారన్న అభియోగాన్ని ఎదుర్కుంటున్న వీరందరూ ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఏ కోర్టు ఎప్పుడు ఆరెస్టంటూ ఆదేశాలు ఇస్తుందో అన్న ఆందోళనతో విధులను నిర్వహిస్తున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నూజివీడు మాజీ ఎమ్మెల్యే అప్పారావు గతంలో మెడికల్ బిల్లులను అధికంగా పెట్టి అసెంబ్లీ ఖజానాకు భారీ టోపీ వేసేందుకు ప్రయత్నించి జైలుకు వెళ్ళారు. ప్రస్తుతం ఈ నేత వైస్సార్ సీపీలో ఉన్నారు.
కళంకిత మంత్రులందరూ తప్పుకోవాలంటూ ఆందోళనలు నిర్వహించి ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు శతవిధాల ప్రయత్నించిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఎమ్మెల్యేలు కూడా తామేమీ తక్కువ కాదన్నట్లు హత్యలు, హత్యాయత్నాలు, భూ కబ్జాల ఆరోపణలతో జైలుకు వెళ్తున్నారు. టీడీపీకి చెందిన సుమన్ రాథోడ్ భూ కబ్జా కేసులో జైలుకు వెళ్ళారు. గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హత్య కేసుతో ప్రమేయం ఉందన్న అభియోగంపై జైలు ఊచలు లెక్కిస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునిత కుమారుడు శ్రీరాం ఎమ్మెల్యే కాకపోయినా జిల్లాలో తనకంటూ ప్రత్యేకతను కలిగి ఉన్నాడు. ఆయన కూడా కాంగ్రెస్ నేత హత్యకు కుట్ర పన్నారన్న అభియోగంపై కేసులో చిక్కుకుని త్రుటిలో జైలుకు వెళ్ళకుండా బయట పడ్డారు. అయినప్పటికీ ఆయనపై పోలీసులు తమ పంథాను వీడకుండా వెంటాడుతూనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో రాప్తాడు నుంచి సునిత స్థానంలో శ్రీరాం టీడీపీ తరఫున పోటీ చేయనున్నారు. ఇదే కేసులో కదిరి ఎమ్మెల్యే కుట్ర కేసుతో సంబంధం ఉన్న వారికి బెంగళూరులో దాచి ఉంచారన్న కేసును ఎదుర్కొనే అవకాశం ఉంది. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం గతంలో హత్య కేసులో జైలుకు వెళ్ళి వచ్చారు.
అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల వైఖరిని ఎండగట్టేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పీకల్లోతు అవీనితి ఆరోపణలతో కూరుకుపోయి జైలులో మగ్గుతున్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఢిల్లీ స్థాయిలో దర్యాప్తు సంస్థలు విచారణ సాగిస్తున్నాయి. ఇదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మురళీ, ఆయన భార్య మాజీ మంత్రి కొండా సురేఖలు కూడా అనేక పర్యాయాలు హత్యలు, దొమ్మీల కేసులో విచారణను ఎదుర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ రహమాన్ తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ తుపాకీని గాలిలో పేల్చి జైలుకు వెళ్ళి వచ్చారు. కాంగ్రెస్, టీడీపీ, వైస్సార్ సీపీలకు తోడుగా తాజాగా ఎంఐఎం పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీ చేరిపోయారు. అక్బర్‌తో పాటు ఎంఐఎంకు చెందిన మరో అయిదుగురు ఎమ్మెల్యేలు అధికారులపై దౌర్జన్యాలకు దిగడం, ప్రజలను బెదరించేందుకు గాలిలోకి కాల్పులు జరపడం, ఘర్షణలకు ఉసి గొల్పడం లాంటి పలు నేరాలపై అనేక పోలీసుస్టేషన్‌లలో విచారణను ఎదుర్కుంటున్నారు. నేరం ఏదైనా ప్రస్తుతం అక్బర్ జైలులో ఉంటూ వెళ్ళి న్యాయ పోరాటానికి సన్నద్దమయ్యారు. టిఆర్‌ఎస్‌కు చెందిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ద్వంద్వ పౌరసత్వం కేసులో విచారణను ఎదుర్కుంటుండగా, కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ మదుయాష్కీ నకిలీ వీసాలతో కుటుంబసభ్యులను విదేశాలకు పంపించారన్న అభియోగాన్ని ఎదుర్కుంటున్నారు.

No comments