అవినీతిపై ఎస్‌ఎంఎస్
గర్ల్
ప్రెండ్స్‌కు పంపే మెసేజ్‌లను తగ్గించి యువత అవినీతిపై ఎస్‌ఎంఎస్‌ల సమరం
చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చా రు. అవినీతిని
అంతమొందించేందు కు హైటెక్ యుద్ధం చేయాల్సిన పరి స్థితి వచ్చిందని, ఈ
పరిస్థితిని దుష్ట కాంగ్రెస్ పాలకులే కల్పించారని అన్నారు. వస్తున్నా
మీకోసం కార్య క్రమంలో భాగంగా శనివారం జిల్లాలో నాలుగవ రోజు పాదయాత్ర ఖమ్మం
గ్రామీణ మండలం మద్దులపల్లి గ్రామం నుండి బాబు పాదయాత్ర ప్రారంభమైంది. ఈ
సందర్భంగా పలుచోట్ల ప్రజలనుద్దేశించి ప్రసంగించిన బాబు కాంగ్రెస్
ప్రభుత్వంలో జరిగిన అవినీతిని తూర్పారపట్టారు. తమ్ముళ్లా రా సెల్‌ఫోన్‌ల
ద్వారా మహిళా స్నేహితురాళ్లకు ఊకదంపుడు సందేశాలు పంపటానికి బదులు అవినీతికి
పాల్పడుతున్న దొంగలకు సందేశాలు పంపాలని సూచన చేశారు. కాంగ్రెస్ పాలకులు
ఉచిత విద్యుత్ పేరుతో అధికార ంలోకి వచ్చి ప్రజల పై విద్యుత్‌భారాన్ని
మోపారని ధ్వజమెత్తారు. ఓ పక్క విద్యు త్ ఛార్జీలు చెల్లించలేని
పరిస్థితుల్లో ప్రజలు ఉంటే మరో పక్క నిత్యావసర వస్తువుల ధరలను
తొమ్మిదేళ్లలొ 300 రెట్లు పెంచారని ప్రజల ఉసురుకు వారు బలవుతారన్నారు.
కాంగ్రె స్ పాలకులు తొమ్మిదేళ్లలో సంపాదించిన అవినీతి సొమ్మును రైతుల
రుణమాఫీకి ఐదుసార్లు చేసిన ఇంకా సొమ్ము మిగులుతుందని ఎద్దేవా చేశారు.
ప్రజలు ఉచితాలను నమ్మి దొంగలకు ఓట్లేయటంతో ప్రజలకు ఈ దుస్థితి
పట్టిందన్నారు. యువతకు భవితలేకుండా చేశారని ఈ పాపం ఊరికే పోదన్నారు.
అభివృద్ధిలో ఉన్న రాష్ట్రాన్ని దారి మళ్లించి వారుమాత్రమే అభివృద్ధి
చెందారని విమర్శించారు. మీరు చూపిస్తున్న ఆదరణ నా జీవితంలో మర్చిపోలేనని, ఈ
జీవితం మీకే అంకితమని దేవుడు నాకు ఆయుష్ ఇచ్చినంత కాలం నీ అభ్యున్నతి
కోసం శ్రమిస్తానని చెప్పారు. అవినీతి దొంగలకు సీబీఐ శిక్షలు వేయకుండా
ముఖ్యమంత్రి, మంత్రివర్గం అడ్డుపడుతున్నారని అయినప్పటికీ సీబీఐ
ఛార్జిషీట్లు వేసి మొదట రూ 146 కోట్లను ఎటాచ్‌మెంట్ చేసి అనంతరం మరో రూ
53కోట్లకు ఎటాచ్‌మెంట్ చేసిందని త్వరలో అవినీతి పుట్టలను సీబీఐ తవ్వి
ఎటామెంట్ చేసే పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన
రెండేళ్లలో ప్రజల పై రూ 32వేల కోట్లు భారంమోపారని, మరో మూడేళ్ల అనంతరం
14వేల కోట్లు, మరో రెండేళ్ల అనంతరం 15వేల కోట్లు వెరసి 62వేల కోట్ల
భారాన్ని ప్రజల పై మోపారని, ఇంతకన్నా దారుణమేముంటుందని ప్రశ్నించారు. ఈ
రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం ముఖ్యమంత్రి, మంత్రివర్గమేనని
ధ్వజమెత్తారు. మీ కష్టాలను నా కళ్లతో చూస్తున్నానని త్వరలోనే మీకు
మంచిరోజులు రానున్నాయని రానున్న ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేసే పరిస్థితికి
మీరు ఎదగాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నానన్నారు. కార్యక్రమంలో
ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు పాల్గొన్నారు.
No comments