సంక్రాంతి కళతప్పింది
తెలుగు వాకిళ్ళలో ఈ ఏడాది సంక్రాంతి కళతప్పింది. గ్రామాలు భోగిమంట లకు
బదులు కష్టాల మంటల్లో కాలుతున్నాయి. ప్రకృతి విపత్తులతో ఈ ఏడాది
వ్యవసాయరంగం చిత్తయ్యింది. ఖరీఫ్‌లో ప్రారంభంలో వెంటాడిన వర్షా భావ
పరిస్థితులు 30శాతం పైగా పోలాల్లో విత్తనం పడనీయకుండా చేశాయి. నీలం తుఫాన్
పంటలను నివువునా ముంచెత్తి రైతు బతుకును కన్నీటి మయం చేశాయి. రాష్ట్ర
రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి స్వయంగా వ్యవసాయరంగానికి జరిగిన నష్టం
పట్ల ఆందోళన వెలిబుచ్చారు.
రైతుకు దెబ్బమీద దెబ్బ పడిందని అంగీకరించారు. కనీసం రైతులను భూమి శిస్తు పన్నుల బకాయిల భారం నుంచైన తప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. దీన్నిబట్టే రాష్ట్రంలో వ్యవసాయ రంగం కష్టాలు కళ్ళకు కట్టక మానవు. నీలం తుపాన్ ధాటికి నోటికాడికొచ్చిన పంటలు నీటిపాలయ్యాయి. 16 జిల్లాలు తుపాన్ ధాటికి వణికి పోయాయి. ఏడున్నర లక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. సుమారు 60 మందికిపైగా ప్రాణాలు కోల్పొయారు. 40 వేల ఇళ్ళు దెబ్బతిన్నాయి. కరు వులు వరదలతో వ్యవసాయరంగం చిన్నాభిన్నమైంది. రైతులు మరో పదేళ్ళకుగాని కోలుకోలేనంతగా నష్టపోయారు. అసలే పెరిగిన రసాయనిక ఎరువులు , పురుగుమందుల ఖర్చులు భరించి పంటలు సాగుచేశారు.
వ్యవసాయ కూలీ ఖర్చులతో కలిపి పంటసాగు పెట్టుబడులు తడిసి మోపడయ్యాయి. ఇంత చేసి పంట సాగు చేస్తే ప్రకృతి కెన్నెర్రతో అప్పులే మిగిలాయి. రైతుల ఇంట భోగిమంటల స్ధానంలో ఈ సంక్రాంతికి అప్పుల మంటలు భగభగ మండుతున్నాయి. ఖరీఫ్‌లో జరిగిన నష్టాలను ఎటూ పూడ్చుకోలేని పరిస్థితి. కనీసం రబి పంటల ద్వారానైనా కూలీపాటి ఖర్చులు మిగుల్చుకుందామా అనుకున్న రైతు లకు ఆ ఆవకాశం కూడా లేకుండా పోయింది. రాష్ట్రంలోని శ్రీశైలం మొదలకుని నాగార్జున సాగర్, శ్రీరాం సాగర్ తదితర సాగునీటిప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. రిజర్వాయర్లలో తగినంత నీరు లేకపోవటంతో రబీ పంటల సాగు లక్ష్యాలు ప్రాధమిక దశలోనే ఎండిపోయాయి.
రైతు లు కాల్వల కింద ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటనలు చేసి చేతులు దులుపుకుంది. రైతులు వరికి బదులుగా జొన్న, మొక్కజొన్న తదితర పైర్ల వైపు మొగ్గారు. రాష్ట్రంలో రబీ సాగు అధికంగా బోర్లమీదనే ఆధారపడి ఉంది. అయితే ఈ సారీ బోర్లకింద పంటసాగు కూడ బోరుమంటోంది. రబిసాగు సాధారణ విస్తీర్ణం 98 లక్షల ఎకరాలు కాగా అందులో ఇప్పటివరకూ 33శాంతం పోలాలు విత్తనం పడకుండా ఖాళీగానే ఉన్నాయి. ఇక ఈ పోలాల్లో విత్తనం పడుతుందన్న ఆశలు కూడా కనిపించటం లేదంటున్నారు. రబీలో సాగు చేసినపైర్లకు కూడా కరెంట్‌గండం కత్తిమీద సాములా మారింది.గ్రామాల్లో వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ ప్రభుత్వ ప్రకటనలకే పరిమితమైంది. కనీసం మూడు గంటలైన వ్యవసాయానికి విద్యుత్ అందటం లేదు. ఇక గ్రామాలు రోజులో 18 గంటలకు పైగా విద్యుత్‌లేకుండానే గడుపుతున్నాయి.
ధరాఘాతం
సంక్రాంతి సంపన్నుల ఇంటనేభోగి మంటలతో వెలుగు తోంది. రైతులతోపాటు సామాన్య , నిరుపేద వర్గాలో ఇంటి ముంగిట ధగధగ లాడాల్సిన భోగిమంటలకు బదులు ఈ సారి అప్పుల మంటలు ఆకలి మంటలు కణకణ మండు తున్నాయి. పంటలు పండించిన రైతువద్ద ఉన్నంత కాలం దిగజారి ఉన్న ధరలు రైతుల నుంచి పంటలు వ్యాపారుల చేతికి చేరగానే ఒక్కసారిగి ధరలకు రెక్కలు మొలిచాయి. పంటలు దెబ్బతిని ఈ ఏడాది ధాన్యం దిగుబడులు తగ్గు ముఖం పట్టేసరికి వ్యాపారులు తమవద్ద ఉన్న సరుకులకు ఒక్కసారిగా ధరలు పెంచి తమ పంట పండించుకుంటు న్నారు.
బియ్యం ధరలు కిలో ఇప్పటికే 45 రూపాయలు ధాటిపోయాయి. వేరుశనగ పప్పు రూ.140 దాటింది. కందిపప్పు కూడా రూ. 90 కి చేరింది. పప్పులు 120 కిపైమాటే. మినుములు రూ.98కి చేరాయి. వంటనూనెల ధరలు భగ్గుమంటున్నాయి. వేరుశనగనూనే ఏకంగా 120రూపాయలకు చేరింది. అన్నిరకాల సరుకుల ధరలు భోగిమంటలకు మించిన రీతిలో శగలు చిమ్ముతున్నాయి. మరోవైపు విద్యుత్తు చార్జీలతో ఇప్పటికే సామాన్యుడు ఇళ్ళు గుళ్ళ చేసుకుంటున్నాడు. పోని పండగ సాకుతో బంధువుల వూళ్ళకు చేరి నాలుగు రొజులు గడిపి ఇంటి సంక్రాంతి పండగ ఖర్చులు మిగుల్చు కుందామనుకున్న వారికి ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ప్రైవేటు బస్సుల చార్జీలు మూడింతలు పెంచేశారు.
ఆర్టీసి కూడా తామేమి తక్కువకాదన్నట్టు ప్రైవేటు బస్సులతో పొటిపడి చార్జీలను పెంచి వేసింది.వూళ్ళకు పోయి బస్సుచార్జీలపేరుతో జేబులు గుళ్ళ చేసుకునేబదులు ఇంటివద్దనే కలోగంజితోనే సంక్రాంతి పండగను కానిచ్చేద్దామిని బతుకు జీవుడా అంటూ బస్టాండ్లనుంచి ఇంటిదారిపట్టిన వారే అధికంగా ఉన్నారు. ఏడాదిలో తొలిపండుగగా వచ్చిన సంక్రాంతి సంబరాలకు బదులు కష్ఠాలను మొసుకొచ్చి సామాన్యుడి ఇంట సమస్యల మంట పుట్టిస్తోంది.

No comments