హద్దు మీరిన ఆయన మాటలు
హిందూ త్వంపై ఎంఐఎం నేత అక్బరుద్ధీన్
చేసిన వాఖ్యలపై శ్రీ పీఠం వ్యవస్థాపకుడు స్వామి పరిపూర్ణానంద తీవ్రంగా మండి
పడ్డారు. హద్దు మీరిన ఆయన మాటలు సరిహద్దుల్లోనూ కలకలం సృష్టిస్తున్నా యని
ఆందోళన వ్యక్తం చేశారు. వరంగ ల్ జిల్లాలో శనివారం జరిగిన స్వామి వివేకానంద
జయంతోత్సవాల్లో ఆయ న పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో జరి గిన సభల్లో
స్వామీజీ భావోద్వేగంతో ప్రసంగించారు. అక్బర్ వ్యాఖ్యలు వెలు వడిన
నేపథ్యంలోనే పాకిస్తాన్ సైన్యం రెచ్చిపోవడంపై సందేహం వెలిబుచ్చా రు.
భారత్-పాక్ వాస్తవాధీన రేఖ వద్ద భారత సేనపై పాక్ సైన్యం కాల్పులు
జరపడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. దీన్నిబట్టి ఎంఐఎం అనుచిత వైఖరిని
సందేహించాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు. మత విద్వేషాల వెనుక పాక్ హస్తం
ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. తాజా ఘటనలే దీనికి ఆధారాలుగా పేర్కొన్నారు.
హిందూవులపై అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతోందని, ఈ నేపథ్యంలో యావత్
హిందువులు సంఘటితం కావాలన్నారు. దీన్ని ఛేదించేందకు సమైక్యంగా ఉద్యమించాలని
పిలుపునిచ్చారు.
అక్రమాలకు పాల్పడినవాళ్ళు, ప్రజలసొమ్ము దోచుకున్నవాళ్ళు, గోమాతను కించపరిచినవాళ్ళు నేడు జైల్లో ఉన్నారని పరిపూర్ణానంద అన్నారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడినందువల్లే అక్బరుద్దీన్ జైలుపాలయ్యాడన్నారు. ప్రజలకు ధర్మం పట్ల విశ్వాసం ఉండాలని, ప్రతిఒక్కరూ ధర్మమార్గం అనుసరించాలని హితవు పలికారు. ప్రజల్లో పాపభీతి ఉం డాలని, అప్పుడే నేరప్రవృత్తి తగ్గుతుందని ఆయన ప్రబోధించారు.

No comments