1

Breaking News

తూర్పుగోదావరి సిడి ఆవిష్కరించిన సిఎం

తూర్పుగోదావరి సిడి ఆవిష్కరించిన సిఎం


 కళలకు కాణాచిగా, ఆధ్యాత్మికతకు నిలయంగా, సాగర సంగమంగా, వేదంలా ఘోషించే గోదావరి నదీ జలాలలో సస్యశ్యామలంగా కన్పించే తూర్పుగోదావరిపై భూపతిరాజు కృష్ణంరాజు రూపొందించిన సిడిని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు. తూర్పుగోదావరి వైశిష్టతను ఇక్కడి అన్ని ప్రాంతాల్లో మతాలు, సంస్కృతులు, సాంప్రదాయాలను తెలియజేస్తూ కృష్ణంరాజు మాస్టార్‌ ప్రత్యేకంగా ఓ పాటను రూపొందించి ఆ సన్నివేశాలకనుగుణమైన దృశ్యాలతో సీడిని తయారు చేసారు. ఈ సిడిని శుక్రవారం సాయంత్రం బీచ్‌ఫెస్టివల్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర టూరిజం శాఖామంత్రి చిరంజీవి, రాష్ట్రమంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వట్టి వసంతకుమార్‌, తోట నరసింహం, పినిపే విశ్వరూప్‌, పొన్నా లక్ష్మయ్య తదితరులు ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి చిరంజీవిలకు ఎమ్మెల్యే కన్నబాబు కృష్ణరాజు మాస్టార్‌ను పరిచయం చేసారు. అలాగే జిల్లా వైశిష్టతను తెలియజేసే పోస్టర్స్‌ను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు శాసన సభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపిలు, అధికారులు పాల్గొన్నారు.

No comments