మేం గాజులు తొడుక్కుని లేం.
రాష్ట్రాన్ని విభజిస్తే తాను రాజీనామాకు సిద్ధమని గుంటూరు ఎంపీ రాయపాటి
సాంబశివరావు అధిష్ఠానాన్ని హెచ్చరించారు. గుంటూరులో బుధవారం జరిగిన
మహాశాంతి యజ్ఞం లో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. విభజన
జరగకూడదని కోరుతూ మహాశాంతి యాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులను తరిమి కొట్టాలని ఎంపీ
మధుయాష్కీ చేసిన ప్రకటనపై రాయపాటి తీవ్రంగా స్పందించారు.
"వాళ్లు తరిమి కొడుతుంటే చూస్తూ ఉండడానికి మేం గాజులు తొడుక్కుని లేం. తడాఖా చూపిస్తాం'' అని హెచ్చరించారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము త్యాగాలకు సిద్ధంగా ఉన్నామన్నారు. అవసరమైతే ఎంపీలే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అదిగో తెలంగాణ, ఇదిగో తెలంగాణ అంటూ సీమాంధ్రుల మైండ్‌సెట్ మార్చేందుకు తెలంగాణవాదులు తప్పుడు సంకేతాలిస్తున్నారని, వాటిని నమ్మవద్దని రాయపాటి పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాదని, ప్రజలు భయపడాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు.

No comments