1

Breaking News

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'' సినిమాను ఓ మల్టి స్టారర్ చిత్రంగా చూడొద్దు. ఇది ఒక అద్భుతమైన కుటుంబ కథా చిత్రం. ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చెప్పిన కథ విని కేవలం పది నిమిషాల్లో ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. ఇది మల్టీ స్టారర్ సినిమా కాదు. ఓ మంచి కుటుంబ కథా సినిమా, సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రేక్షకుల అభిమానం, ఆదరణ చూస్తుంటే కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. ఈ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించనివ్వండి''... అంటూ మహేశ్ తన మనసులో మాటలను బయటపెట్టారు. విజయవాడ నగరంలో ఒక బంగారు దుకాణం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన ' సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెటు'్ట యూనిట్ ముఖ్యులతో కలసి బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు.

ఆనందాన్నిచ్చిందిదయచేసి దీనిని మల్టీ స్టారర్ సినిమాగా చూడొద్దు. కుటుంబ వ్యవస్ధ పరంగా చూస్తే ఇది చాలా మంచి సినిమా. ఇందులో నటించడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.

చాలా నేర్చుకున్నావెంకటేష్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. చాలా క్రమశిక్షణ ఉన్న నటుడాయన. తనతో కలిసి నటించడం ఒక మధురానుభూతి. రియల్లీ ఇట్స్ యాన్ అన్‌బిలీవబుల్ ఎక్సపీరియన్స్. మరో మల్టీస్టారర్ గురించి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

విజయవాడతో అనుబంధంవిజయవాడ నిజంగానే నాకొక సెంటిమెంట్. 'ఒక్కడు', 'పోకిరి' సినిమాలు విడుదలైనప్పుడు విజయవాడలోనే ఉన్నా. 'దూకుడు' సినిమా వంద రోజుల వేడుక ఇక్కడే చాలా బాగా జరిగింది.

మంచి ప్రయోగంఈ సినిమాలో నాకు, వెంకటేష్‌కి ప్రత్యేకంగా పేర్లు లేకపోవడాన్ని పెద్దోడు, చిన్నోడుగా పిలవడాన్ని మంచి ప్రయోగంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సినిమాలో పెద్దోడు ఫోన్ చేస్తాడు. చిన్నోడు ఏరా చెప్పు అంటాడు. సహజంగా కన్పించే ఈ సీన్ చేసేటప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. సినిమాకి ఇదే ఒక కొత్తదనం.

బాలీవుడ్‌కి వెళ్లనురాజకీయ నేపథ్యంగా ఉన్న చిత్రాల్లో నటించను. అసలు ఆ ఆలోచనే నాకు లేదు. అలాగే బాలీవుడ్‌కి వెళ్లాలనే ఆలోచన కూడా లేదు. అక్కడ చాలా మంది ఉన్నారు. మనం ఎందుకు? అక్కడి వాళ్లు మనల్ని విమానం దిగగానే వెనక్కి పంపేస్తారు. వాళ్లకు పనిలేదనుకుంటున్నారా? గత రెండేళ్లుగా బాలీవుడ్‌కి వెళ్లే ఆలోచన లేదని చెబుతూనే ఉన్నా. ఇప్పటికీ నా అభిప్రాయం అదే.

సినిమా తీయడానికి భయపడ్డా : దిల్ రాజు
తాను ఈ సినిమా తీయాలని తలంపు వచ్చినప్పుడు కొంచెం భయపడ్డానని వెంకటేష్, మహేష్‌బాబుతో మాట్లాడాక ఆ భయం పూర్తిగా తొలగిపోయిందని చిత్ర నిర్మాత దిల్ రాజు అన్నారు. తాను వారిద్దరితో ఈ సినిమా కోసం మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు మల్టీ స్టారర్‌ల సినిమా కావడంతో ఇద్దరి అభిమానులు ఈ సినిమాని ఆదరిస్తారని ఎలాంటి బెంగ అవసరం లేదని వివరించానని రాజు అన్నారు. తాను ఊహించిన విధంగానే ఈ సినిమాను అందరూ ముఖ్యంగా వెంకటేష్, మహేష్ అభిమానులు బాగా ఆదరిస్తున్నారని దిల్ రాజు అన్నారు. అన్ని సెంటర్‌లలో ఆల్‌టైమ్ రికార్డు వసూళ్ళు వస్తున్నాయని ఆయన చెప్పారు.

విజయవాడలో 20 థియేటర్‌లలో ఈ సినిమా విడుదలైతే ఈ రోజుకి ఉదయం ఆటలు అన్నీ హౌస్‌ఫుల్ కలెక్షన్‌లతో నడుస్తున్నాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇది కలెక్షన్‌ల పరంగా ఫుల్ మీల్స్ భోజనంలాగా ఉందని ఆయన అన్నారు. చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ తాను మూడేళ్ళ పాటు కష్టపడి తయారు చేసుకున్న ఈ కథను విని చిత్రంలో నటించడానికి అంగీకరించిన వెంకటేష్, మహేష్‌బాబులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో 'దూకుడు' సినిమా నిర్మాతల్లో ఒకరైన గోపి, అలంకార్ ప్రసాద్, బివి రాజు, ఎల్‌విఆర్ తదితరులు పాల్గొన్నారు.

No comments