‘చిన్న సినిమా’
జెర్సీ
ప్లాట్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘చిన్న సినిమా’. ‘అన్‌లిమిటెడ్
బడ్జెట్’ అనేది ఉపశీర్షిక. ఎ.కె.కంభంపాటి దర్శకుడు. శేఖర్-జ్యోతి
నిర్మాతలు. వెన్నెలకిశోర్, తాగుబోతు రమేష్ ఆలపించిన ఈ సినిమా టైటిల్
సాంగ్ ప్రోమోని ఫిలింఛాంబర్ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ
ఆవిష్కరించారు. ఆయనమాట్లాడుతూ-‘‘విద్యావం తులైన కొత్తతరం తీసిన చిత్రమిది.
సినిమా కథాపరంగా మార్పులు రావాల్సిన ఈ రోజుల్లో..సరికొత్త పంథాలో
చిత్రాన్ని తీస్తున్నారు. పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు. దర్శకుడు
మాట్లాడుతూ-‘‘అమెరికా పిచ్చోడు...సినిమా అవకాశాల కోసం వెతికేవాడు...గీత
వెంటపడే గోపి..ముసలాళ్ల సొల్లు కబుర్లు..పరిశ్రమను కుమ్మేద్దామ నుకునే
ఎన్నారై..ఫూల్స్..దందా గాళ్లు...మంజరి అనే నర్తకి ...వీరం దరి కథ మా
సినిమా. డైలాగ్స్ ఆధారంగా నడిచే కామెడీ చిత్రమిది.
ఫీల్‌గుడ్, లవ్‌స్టోరి కాదు. అమెరికా, భారత్‌లో తెరకెక్కించాం. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు చేస్తున్నాం. వారంలో ఆడియో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. 6పాటలున్నాయని సంగీతదర్శకుడు ఎల్.ప్రవీణ్ తెలిపారు. టైటిల్‌కి చక్కని స్పందన వస్తోందని నిర్మాత అన్నారు. నాచకి, కుమార్, వినయ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్జున్ కళ్యాణ్, సుమోన చందా, వెన్నెలకిషోర్, తాగుబోతు రమేష్, బాలయ్య, ఎల్బీశ్రీరాం, సూర్య కేథీ తదితరులు నటించారు. కెమెరా: హైదర్ బిల్‌గ్రామి, పి.జి.విందా, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కథ-మాటలు: శేఖర్, పాటలు: చక్రవర్తుల, శ్రీనివాసమౌళి, శ్రీజో, కె.ఎస్.ఎమ్.ఫణీంద్ర.

No comments