‘అరవింద్-2’.
ఎ ఫిల్మ్ బై అరవింద్’ రూపకర్త శేఖర్ సూరి దర్శకత్వంలో రూపొందుతున్న
సినిమా ‘అరవింద్-2’. ‘ఈరోజుల్లో’ ఫేం శ్రీ కథానాయకుడు. జి.ఫణీంద్ర,
జి.విజయ్‌చౌదరి నిర్మాతలు. శ్రీ విజయభేరి ప్రొడక్షన్స్ పతాకంపై
తెరకెకుక్కుతోంది. ఫిబ్రవరిలో రిలీజ్ సందర్భంగా శేఖర్‌సూరి మాట్లాడుతూ-‘‘ఎ
ఫిల్మ్ బై అరవింద్..ని మించి మూడింతలు అదనపు థ్రిల్‌నిచ్చే చిత్రమిది.
మేకింగ్ హాలీవుడ్ స్థాయిలో ఉంటుంది. హీరో శ్రీ ఓ వైవిధ్యమైన పాత్రలో
కనిపిస్తాడు. ఇటీవల విడుదలైన ఆడియో, ట్రైలర్స్‌కి విశేష స్పందన వచ్చింది.
ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. కెమెరా: కె.రాజేంద్ర
బాబు, సంగీతం: విజయ్ కూరాకుల, ఎడిటింగ్: భీమిరెడ్డి తిరుపతిరెడ్డి,
థ్రిల్స్: వెంకట్‌నాగ, మాటలు-పాటలు: సురేంద్ర కృష్ణ, కళ: వెంకటేష్,
కథ-కథనం- దర్శకత్వం: శేఖర్ సూరి.
No comments