1

Breaking News

విభజన జరిగితే మంత్రి పదవిని వదులుకోవడానికి సిద్ధమని....

రాష్ట్రం ఎన్నటికీ సమైక్యంగానే వుంటుందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మరోసారి స్పష్టం చేశారు. ఒకవేళ రాష్ట్ర విభజన జరిగితే మంత్రి పదవిని వదులుకోవడానికి సిద్ధమని ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పంచాయతీరాజ్ అతిధిగృహానికి బుధవారం వచ్చిన మంత్రి విశ్వరూప్‌ను ఆంధ్రా యూనివర్శిటీ పూర్వ విద్యార్థుల సంఘం కలుసుకుంది. 

తొలుత అతిధిగృహం ఎదుట పూర్వ విద్యార్థులు సమైక్య నినాదాలతో హోరెత్తించారు. అనంతరం మంత్రి విశ్వరూప్‌ను కలుసుకున్నారు. ఢిల్లీలో అధిష్టానాన్ని కలిసి సమైక్యవాదాన్ని వినిపించిన మంత్రిని ప్రత్యేకంగా అభినందించారు

No comments