. 60 ఏళ్లగా.....
తెలంగాణ ప్రజలను వంచిస్తున్న కాంగ్రెసు పార్టీపై యుద్ధం ప్రకటించాలని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పిలుపు నిచ్చారు. 60 ఏళ్లగా కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రజలను పదే పదే వంచిస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను ప్రలోభపెట్టడం, అణచివేయడం వంటి చర్యల ద్వారా కాంగ్రెసు తెలంగాణ ప్రజలను పదే పదే మభ్య పెడుతుందని ఆయన విమర్శించారు.
తెలంగాణ కోసం పోరాడుతున్న పార్టీలు, ఉద్యమ సంఘాలు, సంస్థలు, మేధావులు, కళాకారులు, ఉద్యోగులు, విద్యార్ధులు కూడా కాంగ్రెసు పార్టీ ఆడుతున్న నాటకంలో భాగమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన తెలంగాణ ప్రజలు భ్రమల నుంచి బయటకి వచ్చి కాంగ్రెస్‌పై మిలిటెంట్ పోరాటాలకు సిద్ధపడాలని కోరారు. ఇందులో భాగంగా 26వ తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకలను బహిష్కరించాలని ఆయన పిలుపు నిచ్చారు.

No comments