రోజుకో రకంగా డ్రామాలాడిస్తోందని .....
రాష్ట్రంలో ప్రజల మనోభావాలను గాలికొదిలేసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు, సమైఖ్య రాష్ట్రంగా ఉంచటం అనే సమస్యపై కాంగ్రెస్ అధిష్టానం ఇరు ప్రాంతాల నాయకులను ఢిల్లీకి పిలిపించి వారితో రోజుకో రకంగా డ్రామాలాడిస్తోందని ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. బుధవారం ఆయన సత్తుపల్లిలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల మనోభావాలను గుర్తించాల్సిన కాంగ్రెస్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చిందని ధ్వజమెత్తారు.
అధికారమే పర మావధిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి, కేవీపీ రామచంద్రరావులు అప్పట్లో ఈ ప్రాంత ఎమ్మెల్యేలను కాంగ్రెస్ అధిష్టానం వద్దకు పంపారని అన్నారు. ప్రస్తుతం వైఎస్ ఆత్మ రూపంలో కేవీపీ ఢిల్లీలో సీమాంధ్ర నేతలను వెంటేసుకుని సమైఖ్య రాష్ట్రం అంటూ పైరవీలు చేయటం దారుణమన్నారు. రాష్ట్రంలో పరిస్థితిపై కాంగ్రెస్ వెంటనే తననిర్ణయం ప్రకటించాలని కోరారు.

No comments