అధిష్ఠానానికి తెలుసునని...
రాష్ట్రాలను విభజించాల్సి వస్తే అది రాజకీయ కోణంలో కాకుండా పాలన సౌలభ్యం కోసం జరగాలని కేంద్ర మంత్రి పల్లంరాజు అభిప్రాయపడ్డారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు. అదే పెద్ద రాష్ట్రాల వల్ల సులభ పాలనతో అభివృద్ధి వేగవంతంగా సాగుతుందన్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా బుధవారం తిరుమల వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.
తమ సొంత ప్రాంతాల్లో ఆస్తులన్నీ అమ్మేసి చాలామంది హైదరాబాదులో వాణిజ్య పరంగా స్థిరపడ్డారన్నారు. ఇప్పుడు వాళ్లంతా తమ సొంత ప్రాంతాలలో సంబంధాలు పూర్తిగా కోల్పోయారని పేర్కొన్నారు. అలాంటి వారిని, ఇతర పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తమ అధిష్ఠానం.. తెలంగాణ విషయంలో రెండు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. మన రాష్ట్రంలో మారుతున్న పరిణామాలు, పరిస్థితులన్నీ అధిష్ఠానానికి తెలుసునని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు

No comments