కాంగ్రెస్ మేథోమథన సదస్సు
జైపూర్‌లో కాంగ్రెస్ మేథోమథన సదస్సు ప్రారంభమైంది. 2014 ఎన్నిలకే లక్ష్యంగా పెట్టుకున్న సదస్సులో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్‌గాంధీ, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంకా సోనియాగాంధీ మాట్లాడుతూ పార్టీ ఐక్యంగా ఉండి సవాళ్లను ఎదుర్కోవాలని సూచించారు. అధికార పక్షంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రజల ఆశలు, ఆశయాలు వమ్ము కారాదని పేర్కొన్నారు. ఏటా కోటి మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. ఆయా రంగాల్లో ఆర్థికాభివృద్ధి సాధించాలనేదే రాజకీయ ఉద్దేశం అన్నారు. మరోవైపు నేరాలు కూడా పెరుగుతున్నాయని అన్నారు.
మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టాలని సోనియా అన్నారు. బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో కృషిచేస్తున్నామన్నారు. అధికారం చేజిక్కించుకోవడం ప్రధాన అజెండా కారాదని అన్నారు. మిత్రపక్షాలు, విధానాల మధ్య సమతుల్యం సాధించాలన్నారు. దేశంలో సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. ఎంత అభివృద్ధి చేస్తున్నా కొన్ని రాష్ట్రాల నుంచి తమకు రాజకీయ మద్దతు లభించడం లేదని వాపోయారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఆత్మపరిశీలన చేసుకోవాలన్నిరు. ఈ 9 ఏళ్లలో పార్టీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని చెప్పారు.

No comments