1

Breaking News

ముద్రించేందుకు డబ్బులు లేక

తాను రచించిన ఓ పుస్తకాన్ని ముద్రించేందుకు డబ్బులు లేక చోరీకి యత్నించానని అం టున్నాడు ఓ వైద్య విద్యార్థి. ఆగ్రాకు చెందిన మయూర్ గుప్తా, ఎంబీబీఎస్ మూడో సంవంత్సరం చదువుతున్నా డు. ఇతడు గత శనివారం ఓ బ్యాంకులోని మహిళా ఉద్యోగిని కత్తితో బెదిరించి చోరీకి యత్నించగా.. ఆమె సహోద్యోగులు అడ్డుకోవడంతో దొరికిపోయాడు.

దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని బుధవారం పనాజిలోని ట్రయల్ కోర్టులో విచారణకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా మయూర్ మాట్లాడుతూ తాను రచించిన ఓ పుస్త క ముద్రణ కోసమే ఈ పని చేయాల్సి వచ్చిందని న్యాయమూర్తికి విన్నవించుకున్నాడు. విచారణ పూర్తయిన అనంతరం మయూర్‌కు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. తాను ముద్రించదలచుకున్న పుస్తకానికి సంబంధించిన వివరాలను మాత్రం మయూర్ వెల్లడించలేదు.

No comments