1

Breaking News

చిన్న సినిమాలకు అన్యాయం చేస్తూ

పెద్ద సినిమాలకు మొత్తం థియేటర్లను కేటాయిస్తూ చిన్న సినిమాలకు అన్యాయం చేస్తూ లీజ్‌ థియేటర్లను నడుపుతున్నవారిపై కాంపిటిషన్‌ కమీషన్‌ ఆఫ్‌ ఇండియాకు ఫిర్యాదు చేయను న్నామంటూ ఏపీ ఫిల్మ్‌ చాంబర్‌ ప్రొడ్యూసర్స్‌ సెక్టార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు నట్టికు మార్‌ అన్నారు. బుధవారం ప్రొడ్యూసర్స్‌ సెక్టార్‌ కౌన్సిల్‌ అత్యవసర సమావేశం హైదరాబాద్‌ ఫిలించాంబర్‌లో జరిగింది. అనంతరం విలేక రుల సమావేశంలో నట్టికుమార్‌ మాట్లా డుతూ ‘చిన్న నిర్మాతలకు థియేటర్లను కేటాయించకపోతే మేం ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాల్సి ఉంటుంది. మహారాష్ట్ర తరహాలో మల్టీప్లెక్స్‌ టిక్కెట్‌ రేట్లు ప్రవేశపెట్టాలి. ఈ నెల 30న జరగబోయే సమావేశంలో మరికొన్ని ముఖ్యాంశాలు చర్చి స్తాం. ఫిబ్రవరి 20లోగా సమస్యలు తేలకుంటే సినిమాల ప్రదర్శన నిలిపేస్తాం’ అన్నారు. చదల వాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘8 సంవత్స రాలుగా పోరాడు తున్నాం’ అన్నారు. ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ‘ చిన్న సినిమా నిర్మాతల విషయంలో న్యాయపరమైన మార్గంలో ఉన్న అన్ని దారుల్లో వెళ్లడానికి మేం సిద్ధంగా ఉన్నాం’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జీవిత, సు రేష్‌ కొండేటి పలువురు నిర్మాతలు మాట్లాడారు

No comments