హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం
'విభజన తప్పనిసరి అయితే, హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రం చేయాలి'...
హైదరాబాద్‌కు చెందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేశ్ గౌడ్ డిమాండ్! ఇదే
డిమాండ్‌కు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా మద్దతు పలికారు.
'పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా రాష్ట్రాన్ని విభజిస్తారనే సంకేతాలు నాకు అందాయి. వచ్చే సంక్రాంతి తెలంగాణలోనే' అని సోమవారం చెప్పిన దానం... బుధవారానికే స్వరం మార్చారు. ఆ ప్రాంతం, ఈ ప్రాంతంతో తమకు సంబంధంలేదని... హైదరాబాద్ ముఖ్యమనేలా మాట్లాడారు. బుధవారం దానం, ముఖేశ్ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు.
హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రంగా చెయ్యాలని.. లేకుంటే నగర ప్రజలకు ప్రజలకు సర్వహక్కులు కల్పించే విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. "అఖిలపక్ష సమావేశానికి మమ్మల్ని పిలవకపోవడం దురదృష్టకరం. గ్రేటర్ హైదరాబాద్ ప్రజల అభిప్రాయాలను చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. గ్రేటర్ ప్రజల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని ఆజాద్, షిండేలకు లేఖలు రాశాం'' అని దానం తెలిపారు.
హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా చేస్తారని, కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారని అంటున్నారని, కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే ప్రజా ప్రతినిధులనే వారే ఉండరని, ప్రజాప్రతినిధులు లేని రాష్ట్రం ఉన్నా, లేకున్నా ఒకటేనన్నారు. జైపూర్‌లో జరిగే చింతన్ బైఠక్‌కు తాను వెళుతున్నానని, అక్కడ తన అభిప్రాయాన్ని సోనియా, షిండేలకు వినిపిస్తానని చెప్పారు. ముఖేశ్ కూడా దానం ప్రకటననే పునరుద్ఘాటించారు. తెలంగాణపై నిర్ణయం చేసే ముందు తమను పిలవాలంటూ షిండేకు లేఖ రాశామని చెప్పారు.
"గ్రేటర్ హైదరాబాద్‌లో దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డారు. 40, 50 ఏళ్లుగా ఉంటున్నారు'' అని తెలిపారు. ఈ సందర్భంగా దానం జోక్యం చేసుకుని.. "గ్రేటర్ హైదరాబాద్ నుంచి రూ. 40 వేల కోట్ల పన్నులు వస్తున్నాయి. మరి, సౌకర్యాలు కల్పించాలా లేదా?'' అని ప్రశ్నించారు.
తెలంగాణ, కోస్తాంధ్ర, సీమ సమావేశాలతో తమకు సంబంధంలేదని, తమది గ్రేటర్ హైదరాబాద్ అని ముఖేశ్ పేర్కొన్నారు. తమ వెనుక కిరణ్ ఉన్నారన్న ఆరోపణలను కొట్టివేశారు. తామేమీ చిన్నపిల్లలం కాదని ముఖేశ్ పేర్కొనగా... సీఎం నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైతే.. తానూ నాలుగుసార్లు ఎన్నికయ్యానని దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ రాష్ట్రం చేసి.. మెదక్‌ను కలపాలి: జగ్గారెడ్డి
దానం, ముఖేశ్‌ల అభిప్రాయంతో జగ్గారెడ్డి ఏకీభవించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, విభజన తప్పదంటే హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి... అందులో మెదక్ జిల్లాను కలపాలన్నారు. బుధవారం సచివాలయంలోని మీడియా పాయింట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన అంశం ఇప్పట్లో తేలేది కాదన్నారు. మతం అంశం వచ్చినప్పుడు ముస్లింలు వంద శాతం మజ్లిస్ వెంటనే వెళతారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
మా సొంతమంటే కుదరదు: నన్నపనేని
'హైదరాబాద్ నగరం మా సొంతం. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కావాల్సిందే' అని డిమాండ్ చేయడం తగదని నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆస్తితోనే హైదరాబాద్ దేశంలోనే ఒక మహానగరంగా రూపాంతరం చెందిందన్నారు.
నిజాం హయాంలో హైదరాబాద్ అభివృద్ధి చెందలేదని, అప్పట్లో అసెంబ్లీ పాత భవనం, ఉస్మానియా ఆస్పత్రి వంటివి మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. తెలంగాణకు వ్యతిరేకం కాదని టీడీపీ నిర్ణయం తీసుకొందని, తాము ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును అడ్డుకోబోమని తెలిపారు. అయితే, అంతకంటే ముందుగా హైదరాబాద్ సంగతి తేల్చాలని డిమాండ్ చేశారు. నీటి పంపకాలు కూడా జరగాలన్నారు.

No comments