1

Breaking News

ముద్దులొలికే ఈ చిన్నారి

ముద్దులొలికే ఈ చిన్నారి పేరు హరి శర్వాణి. వయసు ఎనిమిదేళ్లు. ఈ చిన్నారి 'ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా' అనే వ్యాధితో బాధపడుతోంది. అంటే.. రక్తానికి సంబంధించిన కేన్సర్. తెల్ల రక్తకణాలు విపరీతంగా పెరిగిపోయి మూలుగలో వాటి శాతం ఎక్కువ కావడమే 'ఏఎల్ఎల్' అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకచోట ఫలితం తప్పుగా వచ్చిందేమోనని రెండు మూడుచోట్ల పరీక్ష చేయించినా చివరకు లుకేమియా అని తేల్చారు.

ప్రస్తుతం శర్వాణి నందమూరి బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రిలో డాక్టర్ సెంథిల్ జె.రాజప్ప వద్ద నెలనుంచి చికిత్స పొందుతోంది. ఇప్పటికే మూడు కీమోలు ఇచ్చారు. మొత్తం ఆరుసార్లు కీమో ఇవ్వాలని, ఆ తర్వాత అవసరమైతే మూలుగ మార్పిడి చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పినట్లు పాప చిన్నాన్న సంజయ్ తెలిపారు.

శర్వాణి తండ్రి ప్రైవేటు కంపెనీలో క్లర్కుగా పనిచేస్తున్నారు. తల్లి సాధారణ గృహిణి. వారి నెలసరి ఆదాయం రూ.15వేలు. చికిత్సకు రూ.8 - 10 లక్షల వరకు ఖర్చవుతుంది. పాప చికిత్సకు సాయం చేయాలనుకున్నవారు 93933 93909 నంబరుకు ఫోన్ చేయవచ్చునని సంజయ్ చెప్పారు.

No comments