bio
పర్యావరణ పరిరక్షణ పై భారత దేశ విద్యార్థుల పరిజ్ఞానం అమోఘమని విదేశీయులు
కొనియాడారు.జీవ వైవిద్య సదస్సులో బాగంగా అక్కడ
డెలిగేట్స్ తో మన విద్యార్థులు ఇంటరాక్ట్ అయ్యారు. బయోసేప్టీ పై బాల్య దశనుండే అవగాహన
కల్పించాలని వారు పిలుపు నిచ్చారు.
బాల్యంనుండే విద్యార్థుల్లో పర్యావరణం
పై అవగాహన కల్పించాలని జీవ వైవిధ్య సదస్సు కు విచ్చేసిన డెలిగేట్స్ అభిప్రాయ పడ్డారు.
జీవ వైవిధ్య సదస్సు నేపధ్యంలో ,వివిధ దేశాలనుండి వచ్చిన డెలిగేట్స్ తో ప్రకృతి మిత్ర
సంస్థ ఇక్కడ విద్యార్థులతో మాక్ COP ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేసింది. 18 రాష్ట్ర్రాలనుండి 120 మంది
విద్యార్థలు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు.ఒక్కో విద్యార్థి ఒక్కో దేశానికి రెప్రెజెంటేటివ్
గా ఇందులో వారి వాదనలు వినిపించారు. మన విద్యార్థుల
తెలివి తేటలను డెలిగేట్స్ కొనియాడారు. హైదరాబాద్ ఆతిధ్యం ఎప్పటికి మరచిపోమని వారంటున్నారు.
అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థు లంటున్నారు. ఈ మాక్
ప్రోగ్రామ్ కోసం మూడునెలల ట్రైనింగ్ తీసుకున్నామని ,ప్రకృతిమిత్ర మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ మాక్ కాప్ లో బాగా రాణించిన వారికి,మెయిన్ సెషన్ లో
పాల్గొనే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
No comments