pakistan
పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో
గెలిస్తే...నేనే కాదు..ఫరూక్ అబ్దుల్లా
కూడా చప్పట్లు కొడతారు....ఆ మాట కొస్తే...ఏ ముస్లిమైనా
చేసే పనే అది....అంత మాత్రాన
మా హృదయాల్లో పాకిస్తాన్ ఉందని కాదు.......
ఇట్ ఈజ్ ద కంట్రీ టు రన్ ద
స్టేట్......స్టేట్ కెనాట్ రన్ ద కంట్రీ .....
పాకిస్తాన్ ఇచ్చిన జీహాద్ పిలుపునకు, ఇస్లామిక్ జీహాద్ కు చాలా తేడా
ఉంది....ఇండియా ను
అస్థిరపరిచే లక్ష్యంతోనే పాక్ ఆ రకమైన ఉన్మాదాన్ని ప్రేరేపించింది.......
ఒక వేళ ఇండియా నుంచి విడిపోవాల్సిన
పరిస్థితే వస్తే... ఈ సుందర కాశ్మీరం చాలా బాధలు ఎదుర్కోవాల్సి ఉంటుంది....విభజన అనివార్యమైతే.....కాశ్మీర్
ఒక స్వతంత్ర దేశంగానే మనుగడ సాగించాలనేది నా ఆకాంక్ష.......
స్వేచ్చ కు, బానిసత్వానికి మధ్యన ఉన్న తేడా
గమనించాను కాబట్టే......నా మిలిటెంట్ పోరాటంలో అర్ధం లేదని తెలుసుకున్నాను ......
ఇది ఒకప్పటి కరడు గట్టిన మిలిటెంట్ , హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ గా
వ్యవహరించిన జావేద్ అహ్మద్ భట్ మాట...పాకిస్తాన్ లో ఏడాది పాటు మిలిటెంట్
ట్రైనింగ్ తీసుకుని,
ఇండియన్ ఆర్మీ కి చుక్కలు చూపించిన జావేద్ అహ్మద్ భట్ `ఆజాద్ కాశ్మీర్’ లో ప్రస్తుతం మిలిటెన్సి కి దూరంగా
కాలం వెళ్ళబుచ్చుతున్నాడు......శ్రీనగర్ కు ఉత్తరాన...యూరీ సెక్టార్
కు కనుచూపు మేరలో........హిమాలయాల సానువులను పలకరిస్తూ పారే చల్లని జలాల
మధ్య నుంచి ఆజాద్ కాశ్మీర్ కు తెప్పల్లో ప్రయాణం చేసిన తర్వాత......ఒక మోస్తరు
పల్లెలో జావేద్ అహ్మద్ భట్ సీ వీ ఆర్ న్యూస్ ప్రతినిధి వాసుదేవన్ కు ప్రత్యేక
ఇంటర్వ్యూ ఇచ్చారు.....
రెండు దశాబ్దాల మిలిటెన్సీ కాశ్మీర్ కు
మిగిల్చింది రక్త కన్నీరే.. బిడ్డలను
కోల్పోయిన తల్లి తండ్రులు.......,
ఉపాధి కోల్పోయిన కాశ్మీరీ యువత..........దారీ..తెన్నూ తెలీకుండా.....ఉన్మాదానికి
ఆకర్షితులైన విద్యాధికులు......ఇలా కాశ్మీర్ లో ఏ ప్రాంతాన్ని స్పృశించినా వేదనా
భరిత గాధలే....అలాంటి వెతల్లో నుంచి పుట్టుకొచ్చిన ఒక యువకుడి కథే ఇది....1989 లో
మొదలైన ఉగ్రవాద క్రీడలో జావేద్ అహ్మద్ భట్ చాలా చురుగ్గా ఇన్వాల్వ్ అయ్యాడు.
సరిహద్దులు దాటితే సుందర స్వప్నాలను సాకారం చేసుకోవచ్చుననుకున్న అతనికి ...ఇండియా కంచె
దాటిన తర్వాత పాక్ ఆర్మీ వెక్కిరింపుల ఆహ్వానం ఎదురైంది....మీ కాశ్మీర్ లో టీ వీ
లు, రిఫ్రిజిరేటర్లు, టెలి ఫోన్లు వుంటాయా, అసలు వాటిని మీరెప్పుడైనా చూశారా అంటూ
ఇతనికి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చిన పాకిస్తాన్ ఆర్మీ అధికారి అడిగిన ప్రశ్నకు జావేద్
గుండె రగిలిపోయింది....మీరు చెప్పే వస్తువులన్నీ కాశ్మీర్ లోని మా బాత్రూముల్లో
ఉంటాయని ధీటైన జవాబిచ్చాడు జావేద్....పాకిస్తాన్ లోని యూరోపియన్ లైఫ్ స్టయిల్..ప్రత్యేకించి...ఇస్లాం ధర్మ
సూత్రాలకు విరుద్ధంగా మహిళల వస్త్ర ధారణ ....పాక్ ఒక
ఇస్లామిక్ రిపబ్లిక్ అనే ఒక వాస్తవాన్ని మరిచిపోయేలా చేశాయని జావేద్ గుర్తు
చేసుకున్నాడు. ఉగ్రవాద శిక్షణ లో భాగంగా పాకిస్తాన్ ఆర్మీ చెప్పిన ఒక అంశాన్ని
మాత్రం కాశ్మీరీ యువత బాగా ఆకళింపు చేసుకున్నారనీ, అది అమాయకుల జోలికి వెళ్లకూడదనే
విషయమనీ అంటున్న జావేద్ అసలు పాక్ ఆర్మీ తో తనకున్న అనుభవాల గురించి ఇంకా
ఏమంటున్నాడో మీరే వినండి......
ఇన్ని చేదు అనుభవాలు ఎదురైనా సరే......కేవలం జీహాద్
పిలుపునకు కట్టుబడే తమ శిక్షణా కాలాన్ని పాక్ లో గడిపమని జావేద్ చెప్పుకొచ్చాడు.
అక్కడ ట్రైనింగ్ పూర్తయి ...తిరిగి కాశ్మీర్ నేల మీద అడుగు పెట్టిన తర్వాత
మాత్రం...అసలు ఈ
పోరాటం ఎవరి కోసం అనే అంతర్మధనం మొదలైందని, ఇది కాశ్మీర్ ప్రజల కోసమా? పాకిస్తాన్ ప్రయోజనాల కోసమా? లేక కాశ్మీర్ ను అద్దం పెట్టుకుని
రెండు దేశాలు ఆడుతున్న నాటకమా?
అనేది అంతుబట్ట లేదని అంటున్న జావేద్...కాశ్మీర్ సమస్య ఇంత
చేటుకుఎదిగేది కాదని కూడా విశ్లేషిస్తున్నాడు... కరడు గట్టిన ఉగ్రవాది సయ్యద్
సలావుద్దీన్ 86 లో అసెంబ్లీ ఎన్నికలకు బరిలో దిగినప్పుడు ...అతను ఇక్కడ
మరో పాకిస్తాన్ ను సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడంటూ కాశ్మీరీ లీడర్లు జరిపిన
హంగామా వల్లే..అతను తిరిగి
పాక్ వెళ్లిపోయాడనీ,
కాశ్మీర్ లో మరో పాకిస్తాన్ ను సృష్టించి తీరుతానని చెప్పి మరీ వెళ్ళిన అతను
హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ కమాండర్ గా నడిపిన వ్యవహారమే ఇందుకు నిదర్శనమనీ కూడా
జావేద్ వివరించాడు. 1996 లో ఎన్నికలను
ఎదుర్కునే దమ్ము ఎవరికీ లేనప్పుడు బరిలోకి దిగిన తనను, ఫిరోజ్ ఖాన్, జావేద్ హుస్సేన్, భారత్ భూషణ్ లను చూసి ఫరూక్ అబ్దుల్లా
లాంటి సీనియర్ నేతలే అవహేళన చేసిన విషయాన్ని కూడా జావేద్ గుర్తు చేసుకున్నాడు.
ఇస్లామిక్ జీహాద్ కు, పాకిస్తాన్ పిలుపునిచ్చిన జీహాద్ కు
స్పష్టమైన వ్యత్యాసముందనీ,
అయితే తాము ముస్లిములమైనందువల్ల విధిలేని పరిస్థితుల్లో ఆ పిలుపునకు లోబడి
ఉండాల్సి వచ్చిందనీ జావేద్ విశ్లేషణ. ఇక్కడ అస్థిరత సృష్టిస్తే...దాన్ని అడ్రెస్
చేసే వరకూ,
భద్రతా మండలి లో వీటో పవర్ కోసం భారత్ పట్టు బట్ట లేదనీ, ఇది పాకిస్తాన్ రాజకీయ ప్రయోజనాలకు
అత్యంత అవసరమైన వ్యవహారమనీ కూడా జావేద్ అభిప్రాయం. దీని అంతటికీ అమెరికా పెద్దన్న పాత్ర పోషించటమే కారణమనేది
కూడా జావేద్ విశ్లేషణ.. పునరావాస కల్పనా కార్యక్రమాలు ఫెయిల్ కావటం వల్లనే
కాశ్మీరీ యువత తిరిగి మిలిటెన్సీ వైపు మళ్ళటానికి ప్రధాన కారణమనీ, స్వేచ్చకు, బానిసత్వానికీ నడుమ బేధం తెలుసుకున్న
తనబోటి వాళ్ళు మినహా ఇంకా మెజారిటీ యూత్ అక్కడ ట్రైనింగ్ తీసుకుంటానికి ఇంతకు
మించి వేరే కారణం లేదనీ కూడా జావేద్ అంటున్నాడు. ఇండియా తో సంబంధాలు తెగిపోతే ఈ
నేల బాధలను చూడలేమనీ,
అయితే స్వతంత్ర దేశంగా నైనా ఉండాలి కానీ...పాక్ ఆధీనంలోకి వెళ్ల రాదనీ జావేద్
స్థిరంగా చెపుతున్నాడు... పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో గెలిస్తే...నేనే కాదు..ఫరూక్ అబ్దుల్లా
కూడా చప్పట్లు కొడతారు....ఆ మాట కొస్తే...ఏ ముస్లిమైనా
చేసే పనే అది....అంత మాత్రాన
మా హృదయాల్లో పాకిస్తాన్ ఉందని కాదంటున్న జావేద్... ఇట్ ఈజ్ ద కంట్రీ టు రన్ ద
స్టేట్......స్టేట్ కెనాట్ రన్ ద కంట్రీ
అని కూడా చెపుతున్నాడు....కాశ్మీర్ భారత్ తో నే మనగలదనీ, కానీ భారత్ ను శాసించలేదనేది జావేద్
నిశ్చిత భావన...హుర్రియత్ లీడర్ల వేరు కుంపట్ల వెనుక పరమార్ధం పాకిస్తాన్ నుంచి
డబ్బు మూటల
కోసమో, లేక ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల
తరఫున తెర చాటు వ్యవహారాలు నడపటం కోసమో అనేది అందరికీ తెలిసిన విషయమేనని కూడా
జావేద్ అహ్మద్ భట్ చెప్పుకొచ్చాడు.
కాశ్మీర్ సమస్యకు రెడీమేడ్ సొల్యూషన్
లేదనీ, అలాగే విభజన అనేది ఏ సమస్యకూ పరిష్కారం చూపలేదనీ జమ్మూ
కాశ్మీర్ రాష్ట్ర సీ పీ ఏం ప్రధాన కార్యదర్శి, ఆ రాష్ట్ర అసెంబ్లీ లో పార్టీ ఏకైక ఎం ఎల్ ఏ కూడా అయిన మహమ్మద్ యూసఫ్ తరిగామి అంటున్నారు. అటానమీ
అనేది రాజ్యాంగం కాశ్మీర్ ప్రజలకు ప్రసాదించిన హక్కుఅని అంటున్న తరిగామి , ఇస్లామిక్ మతోన్మాద
శక్తుల వాయిస్ నే , కాశ్మీర్ ప్రజల వాయిస్ గా చూడరాదని కూడా స్థిరంగా
చెపుతున్నారు. కాశ్మీర్ సమస్య ను భారత్-పాకిస్తాన్ దేశాలే పరిష్కరించుకోవాలన్న
ఒబామా ప్రకటన హుర్రియత్ కాన్ఫరెన్స్ కు మేజర్ సెట్ బ్యాక్ అంటున్న తరిగామి తో మా
ప్రతినిధి వాసుదేవన్ మాటా మంతీ
వాయిస్ ఓవర్-1:
కాశ్మీర్ సమస్య కు రెడీమేడ్ సొల్యూషన్
లేదనీ, కాశ్మీర్ లోని వివిధ రాజకీయ పక్షాలకు ఈ సమస్యపై భిన్న
అభిప్రాయాలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణమనీ యూసఫ్ తరిగామి అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న శాంతియుత వాతావరణాన్ని, సమస్య పరిష్కారం
దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కూడా
ఆయన సూచించారు. అలాగే, రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ కు భంగం కలగని రీతిలో సమస్య ను డీల్
చేయాల్సిన అవసరాన్ని కూడా ప్రభుత్వాలు గుర్తెరగాలని ఆయన స్పష్టం చేస్తున్నారు.
అటానమీ అనేది కాశ్మీర్ ప్రజలకు
రాజ్యాంగబద్ధంగా లభించిన హక్కనీ, దేశ విభజన సమయంలో సెక్యులర్ ఇండియా వైపే మొగ్గిన ఈ రాష్ట్ర
ప్రజలకు విధిగా అండాల్సిన ఈ హక్కుని బీ జె పీ తో పాటు, సంఘ్ పరివార్
శక్తులు తప్పుడు కోణంలో చూపే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. అలాగే, కొన్ని ఇస్లామిక్
మతోన్మాద శక్తుల వాయిస్ నే యావత్ కాశ్మీరీ ముస్లిముల వాయిస్ గా చూడరాదని కూడా ఆయన
విజ్ఞప్తి చేస్తున్నారు. ముంబై దాడుల నేపధ్యంలో , భారత్-పాకిస్తాన్ నడుమ నడుస్తున్న సంభాషణలకు కొంత విఘాతం
కలిగిన మాట వాస్తవమేనని కూడా ఆయన అంగీకరించారు.
హుర్రియత్ కాన్ఫరెన్స్ లో కొనసాగుతున్న
అభిప్రాయ బేధాలు చూస్తుంటే, ఆ నాయకుల శక్తి సామర్ధ్యాలు,
నిబద్ధత సన్నగిల్లుతున్న కోణం కానవస్తోందనీ, అలాగే వేర్పాటువాద
డిమాండ్ ను బలంగా వినిపిస్తున్న శక్తుల వాదన ను కూడా అంతా తేలిగ్గా
కొట్టిపారేయలేమనీ కూడా తరిగామి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే—భారత్, పాకిస్తాన్ లే కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలంటూ ఒబామా
ఇటీవల చేసిన ప్రకటన హు ర్రియత్ నేతలకు మింగుడుపడటం లేదంటున్నారాయన. ఇక, అటానమీ విషయానికొస్తే....తమకు మరిన్ని అధికారాలు
కట్టబెట్టాల్సిందిగా వివిధ రాష్ట్రాలు చేస్తున్న విజ్ఞప్తులను ఇక్కడ గుర్తు
చేసుకోవాల్సిన అవసరముందని కూడా అంటున్నారు.
సామ్రాజ్యవాద అమెరికా గ్లోబల్ డిజైన్ లో
భాగంగా మారిపోయిన పాకిస్తాన్...ఈ రోజున ఎదుర్కుంటున్న దయనీయ స్థితి నుంచైనా భారత్
గుణపాఠం నేర్చుకోవాలని తరిగామి అభిప్రాయపడ్డారు. వాస్తవానికి ఈ రెండు దేశాలు మంచి
పొరుగు దేశాలుగా ఉండే పక్షంలో, సమస్య పరిష్కారం లో అంతర్జాతీయ శక్తుల ప్రమేయాన్ని బాగా
తగ్గించవచ్చుననేది తరిగామి భావన. లోగడ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, పాలస్తీనా , ప్రస్తుతం సిరియా లతో అమెరికా ఏ రకంగా వ్యవహరిస్తోందో, భారత్, పాక్ లతో కూడా అంతకు
భిన్నంగా అమెరికా వ్యవహరించలేదనే వాస్తవాన్ని మనం గుర్తుంచుకోవాలంటున్నారు
తరిగామి. అమెరికా తో మిలిటరీ భాగస్వామ్యం కలిగి ఉండటం రెండు దేశాలూ, ఆ మాటకొస్తే
దక్షిణాసియా ప్రాంతానికి కూడా క్షేమకరం కాదనేది తరిగామి భావన.
మనకు మానంగా సమస్యను పరిష్కరించుకునే
ప్రయత్నాన్ని భారత్, పాకిస్తాన్ లు మొదలెట్టాలంటున్న తరిగామి ..ఇస్లామిక్ మతోన్మాద
శక్తుల చేష్టల వల్లే వెలుపలి ప్రపంచానికి కాశ్మీర్ పట్ల తప్పుడు సంకేతాలు
వెళుతున్నాయనే భావన ను తరిగామి వ్యక్తం చేస్తున్నారు. అలాగే విభజన అనేది తెలంగాణా
సమస్యకు, ఆ మాట కొస్తే ఏ సమస్యకూ పరిష్కారం కాదని కూడా ఆయన కుండ బద్దలు
కొట్టినట్టు చెప్పారు. తెలంగాణా ప్రాంత ప్రజల మనోభావాలను, ఆశలను, ఆకాంక్షలను పూర్తిగా
పరిగణనలోకి తీసుకోవలసిన అవసరాన్నిమహమ్మద్ యూసఫ్ తరిగామి నొక్కి చెపుతున్నారు.
No comments