రైతు వ్యతిరేకి ముద్ర నుంచి బయట పడేందుకు బాబు శతవిధాల ప్రయత్నిస్తున్నారు
రైతు వ్యతిరేకి ముద్ర నుంచి బయట పడేందుకు బాబు శతవిధాల ప్రయత్నిస్తున్నారు..ఇన్నాళ్ళు కాంగ్రెస్ ,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రైతు వ్యతిరేకి అంటూ చేస్తున్న ఆరోపణలను చంద్రబాబు తిప్పిగొడ్డుతున్నారు.వస్తున్నా మీ కోసం యాత్రలో తాము అధికారంలోకి వస్తే రైతలకు రుణమాఫీ అని...9గంటల ఉచిత విద్యుత్ అని హమీలుఇస్తున్నారు.అందులో భాగంగా రోజు యాత్రలో ఎక్కువుగా రైతులతోనే మమైకమవుతున్నారు టిడిపి
బాబు పాదయాత్రలో పెద్దసంఖ్యలో హజరవుతున్న రైతాంగం.
రైతు వ్యతిరేకి అని అధికార పక్ష సభ్యులు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతున్న బాబు
రైతులకి ఉచిత విద్యుత్,రుణమాఫీ అంటూ హమిలు .
చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారు....ఆయనకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు అంటూ ఆనాటి సియం వైయస్‌తో సహ అందరూ పదేపదే ఆరోపించేవారు.అసెంబ్లీలోనూ బయట ఇదే మాట్లాడుతూ బాబు పై రైతు వ్యతిరేకి ముద్రను వేసేందుకు ప్రయత్నించేవారు.బాబు కూడా వారు చేస్తున్న ఆరోపణలకు ధీటుగానే సమాధానం ఇచ్చినా ఇప్పటికి కూడా కాంగ్రెస్‌తో సహ కొన్ని పార్టీలు బాబు పై అవే విమర్శలు చేస్తూ వస్తున్నాయి.వీటి అన్నింటిని తిప్పికొడుతూ రైతులకి దగ్గరయ్యోందుకు పాదయాత్రలో బాబు ప్రయత్నిస్తున్నారు.
గతంలో రైతు పోరుబాట అంటూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు వారి కోసం హైదరాబాద్‌లో రైతు కోసం దీక్ష చేపట్టారు.ఇప్పుడు చేస్తున్న వస్తున్నా మీ కోసం యాత్రలో రైతులని దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా పలకరిస్తున్నారు.నేను రైతుబిడ్డనే అంటూ పోలాల్లోకి వెళ్ళి నాగలిపడుతున్నారు బాబు.వ్యవసాయం లాభసాటిగా మారేవరకు తన పోరాటం ఆగదని చెప్తున్నారు.టిడిపి అధికారంలోకి వస్తే రైతులకి 9గంటల ఉచిత విద్యుత్‌తో పాటు ...రుణమాఫీ చేస్తానని హమి ఇస్తున్నారు.అటు రైతాంగం కూడా బాబుకి బాసటగా నిలుస్తుంది.ఎక్కడికి వెళ్ళీనా పెద్దసంఖ్యలో రైతులు హజరై తమ కష్టాలను బాబు దృష్టికి తీసుకువస్తున్నారు.తమ పోలాలకు తీసుకెళ్ళీ జరిగిన నష్టాన్ని చూపిస్తున్నారు.ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బాబుకి చెప్తున్నారు.
No comments