1

Breaking News

పోలీసులు కనిపెట్టలేకుండా సాప్ట్ వేర్ రూపొందిన ఉగ్రవాద సంస్థలు


టెర్రరిస్టులు ఎలాంటి నెట్ వర్క ఉపయోగిస్తారు? వారి సమాచారం తెలుసుకోవడం పోలీసులకు చుక్కుల చూపిస్తోందా? వారి ప్లాన్ లను భగ్నం చేయడంలో పోలీసులు ఎందుకు విఫలమవుతున్నారు? ఎస్.. ఇవన్నీ ప్రశ్నలకు అవుననే సమాధానాలు చెప్తున్నాయి.. ఢిల్లీ పోలీసుల విచారణాంశాలు... పోలీసులనే ఖంగుతినిపించేలా నెట్ వర్క్ డెవలప్ చేసిన ఉగ్రవాద కార్యకలాపాలపై ఓ లుక్కెద్దాం...


చీప్ అనుకున్న దానితోనే చీఫ్ లతో కనెక్టింగ్
చిల్లర ఫోన్ లతో సీక్రెట్ మెసేజ్ లు,సంభాషణలు
పూణే పేలుళ్లకు అంగట్లో దొరికే సాఫ్ట్ వేర్లతో ప్లాన్ చేసిన ఉగ్రవాదులు
ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రూపొందించి బాంబు పేలుళ్లు చేసిన...
అసద్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, సయిద్ ఫిరోజ్, ఇర్ఫాన్ ముస్తఫా
సోషల్ నెట్ వర్క్ సైట్  స్కైప్ ద్వారా మెయిల్స్
డ్రాప్ట్ అన్న ఫోల్డర్ తో పేలుళ్ల సమాచారాన్ని చేరవేసుకున్న ఉగ్రవాదులు
సెల్ ఫోన్స్ ఐడీ కన్పించకుండా ప్రత్యేక సాప్ట్ వేర్
స్కైప్ సీక్రెట్ ద్వారా ఇండియన్ ముజాహిద్దీన్, లష్కరే తోయిబా అధినేతల సంభాషణ
పోలీసులు కనిపెట్టలేకుండా సాప్ట్ వేర్ రూపొందిన ఉగ్రవాద సంస్థలు


ఉగ్రవాద సమాచారం పోలీసులకు ఏమాత్రం అందడం లేదు. ఎలాంటి చిన్న ఆచూకీ కూడా దొరక్కుండా ఉగ్రవాదులు పథకాలు రూపొందించి అనుకున్న టార్గెట్ ను సక్సెస్ చేసుకుంటున్నారు. సరిగ్గా ఇదే జరిగింది.. ఆగస్టులో పూణేలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఉగ్రవాదులు వాడిన నెట్ వర్క్ బాగా పని చేసింది. పోలీసులకే చుక్కలు చూపిస్తున్న ఉగ్రవాదుల నెట్ వర్క్ ఏదో ప్రత్యేకంగా తయారుచేసింది కాదు.. ఆపై పెద్ద ఖర్చు పెట్టి చేసింది అసలే కాదు. మార్కెట్ లో దొరికే కంపెనీలేని చిల్లర ఫోన్లను ఉగ్రవాదులు ఉపయోగించారు. పోలీసుల నిఘా చిక్కకుండా ప్రత్యేక మైన సాప్ట్ వేర్ ఇన్ స్టాల్ చేసుకొని పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు ఇటీవల ఢిల్లీ పోలీసులకు చిక్కిన నలుగురు ఉగ్రవాదులు విచారణలో వెల్లడించారు.  అయితే పోలీసులు ఉగ్రవాదులు వాడుతున్ ఫోన్లను ట్యాప్ చేయాలన్నా, కనీసం వారు వాడుతున్ ఫోన్ల ఐడీలను పట్టుకోవాలన్నా సాధ్యం కాలేదు. ఐడీ నెంబర్లు కనపించుకుండా ఉండేలా సాప్ట్ వేర్లను ఇన్ స్టాల్ చేసుకున్నారు. ఇలా ఏమాత్రం పోలీసులకు దొరక్కుండా పేలుళల్ల సమాచారాన్ని చేరవేసుకున్నారు. ఇకపోతే ఇంటర్నేట్ లో కూడా ఉగ్రవాద సమాచారం ఓ ప్రత్యేక ప్లాన్ ప్రకారం నడిచింది. ఇండియన్ ముజాహిద్దీన్ అధినేత, లష్కరే తోయిబా అధినేత ల మధ్య ఓ సోషల్ నెట్ వర్క్ సైట్ ద్వారానే మాటల పరిచయం జరిగింది. స్కైప్ అనే సోషల్ నెట్ వర్క లో ప్రత్యేకంగా ఓ డ్రాప్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని మరీ ఈ రెండు ఉగ్రవాద సంస్థల అధినేతలు వారి అసోసియేటెడ్స్ కు కీలక సమాచారాలు పంపించారు. ఇలా పూణే పేలుళ్లతో పాటు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పేలుళ్లకు పథకాలు రూపొందించారు.


అధినేతలను కలిసేందుకూ సినీ పక్కీలో ప్లాన్లు
టూర్స్ అండ్ ట్రావెల్స్ పెట్టి యడాపెడా ప్రయాణాలు
ఈ ప్రయాణాల్లోనే అధినేతలతో ములాఖత్ లైన ఆ నలుగురుఔ
కుట్ర కోణాన్ని ట్రావెల్స్ ద్వారా బయటపెట్టిన ఢిల్లీ స్పెషల్ పోలీస్


ఎక్కడో ఉండే ఇండియన్ ముజాహిద్దిన్ అధినేత, లష్కరే తోయిబా అధినేతలను కలవడం ఎప్పుడంటే అప్పుడు వీలుకాదు. కానీ పూణే పేలుళ్లకు పాల్పడ్డ అసద్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, సయిద్ ఫిరోజ్, ఇర్ఫాన్ ముస్తఫా లకు మాత్రం ఇట్టే వీలైంది. అదెలా అనుకుంటున్నారా. అవును. వారు వేసే పథకాలు అలాంటివి. ఏదో ఓ కారణం లేకుండా ప్రతి సారీ ఉగ్రవాద దేశాలు వెళితే సందేహం వస్తుందనుకున్న ఈ నలుగురు వారి అధినేత పథకం ప్రకారం ఓ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థను స్థాపించారు. దాన్ని ఆధారంగా చేసుకొని ఎప్పుడంటే అప్పుడు సౌదీ అరేబియాలో ఉన్న లష్కరే తోయిబా అధినేత ఫయాజ్ కాజ్జీని కలిసి వచ్చేవారు. ఇలా వెళ్లి అలా కుట్రలకు ప్లాన్ చేసుకొని టూర్స్ పేరుతో పూణేలో పేలుళ్లు జరిపినట్టు విచారణలో ఒప్పుకున్నారు.

చూశారా...  వారు ప్లాన్ వేస్తే ఇక అంతే సంగతులు. వారు వేసే కుట్ర పథకాలను భగ్నం చేయడం పోలీసులకు కత్తిమీద సాముల మారింది. చీప్ అనుకున్న దానితోనే చీఫ్ లతో కనెక్ట్ అయ్యేలా నెట్ వర్క్ బిల్డ్ ప్ చేశారు ఉగ్రవాదులు. ఇప్పటికైనా కేంద్ర హోంశాఖ అప్రమత్తమై నిఘా నెట్ వర్క్ ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.

No comments