ఈ కంప్యూటర్ యుగంలో ఫ్యాషన్లకు , వివిధ రకాల డ్రెస్ , కాస్మోటిక్స్ కు బాగా ఆకర్షితులవుతున్నారు
..ప్రస్తుత కాలంలో మహిళలు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనబడేందుకు నిరంతరం పరితపిస్తుంటారు. అందుకోసం వారు మార్కెట్‌లోకి వచ్చే వివిధ రకాల సౌందర్య అలంకరణ సాధనాలు లేదా ఉత్పత్తులు, క్రీములను వాడుతుంటారు. ఈ కంప్యూటర్ యుగంలో ఫ్యాషన్లకు , వివిధ రకాల డ్రెస్ , కాస్మోటిక్స్ కు బాగా ఆకర్షితులవుతున్నారు. ఈ కాలానికి తగినట్టుగానే మహిళలు సౌందర్యం తమను తాము తీర్చుదిద్దుకుంటున్నారు. ముఖ్యంగా, మహిళలు వాడే వివిధ రకాల లిఫ్టిస్టిక్‌ల వల్ల గర్భంలోని శిశువుకు కూడా హాని కలుగుతున్నట్టు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయం స్కాట్‌లాండ్ విశ్వవిద్యాలయం ఓ సర్వేలో తెలిపింది.
మేకప్ చేసుకోవటం వల్ల కలిగే దుష్పరిణామాలు ఏమిటి ? టీవీ , మీడియా, సినిమా రంగాల్లో ప్రస్తుతం మహిళలు కీ రోల్ పోషిస్తున్న తరుణంలో వారిపై ఏరకమైన ప్రభావం చూపుతోంది. గర్భిణీగా వున్న సమయంలో స్త్రీలు మేకప్ కు దూరంగా వుంటే మంచిదా..
ప్రస్తుత ఆధునిక కాలానికి తగినట్లు గర్భిణీ స్త్రీలు కూడా వివిధ రకాల క్రీమ్‌లు, పెర్ఫ్యూమ్ లు, వంటి కాస్మాటిక్స్ ను వినియోగిస్తున్నారు. అయితే ఇది తల్లికే తెలియకుండా గర్భంలోకి వెళ్లి గర్భంలో పెరిగే పసికందుపై ప్రభావం చూపిస్తున్నట్టు ..విశ్వవిద్యాలయం సర్వేలో తేలింది. అందులోనూ ముఖ్యంగా తల్లి కడుపులో పెరుగుతున్నది మగబిడ్డ అయితే, ఆ బిడ్డపై ఎక్కువ దుష్పలితాలు చూపిస్తున్నాయట. జ్ఞాపకశక్తి తగ్గుదల, శరీర అవయవాల పెరుగుదల ఇత్యాది అంశాలపై ప్రభావితం చూపిస్తున్నాయని ఆ సర్వేలో తేలింది. ఎనిమిదో వారం నుంచి 12వ వారం వరకు గల మధ్యకాలంలో గర్భంలో పెరిగే పిండంలో అవయవాల పెరుగుదల కనిపిస్తుందని, ఇలాంటి సమయంలో కొన్ని హార్మోన్లు పిండంపై ప్రభావం చూపడం వల్లే జ్ఞాపకశక్తి తగ్గుదల వంటి లోపాలు కనిపిస్తాయని తేలింది. ఇవి ఎక్కువగా మగ పిల్లల్లోనే కనిపిస్తాయని పేర్కొంది. ఈ సమయంలో తల్లి ఉపయోగించే అలంకరణ వస్తువులు బిడ్డ యొక్క హార్మోన్ల పునరుత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయట.టెస్ట్రోస్‌రోన్ అనే హార్మోన్ మగవారిలో పునరుత్పత్తిని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమైంది. దీనిపైనా ఈ సౌందర్య పదార్థాలు ప్రభావం చూపిస్తాయని ఈ సర్వే పేర్కొంది. ఈ సౌందర్య వస్తువులను మోతాదుకు మించి ఉపయోగించడం వల్ల పిల్లలకు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందని పేర్కొంది. అందువల్ల గర్భందాల్చిన మహిళలు ప్రసవం అయ్యేంత వరకు సౌందర్య క్రీములకు కాస్త దూరంగా ఉంటే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.
అందమైన ముఖానికి మచ్చలాగా అక్కడక్కడా మొటిమలు మొలిచి వ్యక్తుల ప్రసన్నతను దెబ్బతీస్తుంటాయ. అలాంటి మొటిమలు రాకుండా ఉండాలని అందరూ కోరుకుంటారు. అసలు మొటిమలు ఎవరికి ఎందుకు వస్తాయో తెలుసుకొంటే వాటిని పోగొట్టడం తేలికఅవుతుంది.
. మొటిమలు అన్ని వయసులవారినీ బాధించే సమస్య. కారణాలమీద దృష్టి సారించి వాటికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు, సూచనలు పాటిస్తే ఈ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. యుక్తవయసులో ఎక్కువగా వస్తుంటాయి అయితే ఇవి కేవలం ముఖానికి మాత్రమే పరిమితం కావాలని లేదు; చేతులు, వీపు, ఛాతి, మెత ఈ ప్రాంతాలలో కూడా రావచ్చు. చర్మంపైన ఉండే నూనె గ్రంథులు మార్గాలు అడ్డుకుపోయినపుడు మొటిమలు తయారవుతాయి. చర్మపు ఉపరితలం మీద ఉండే మృత కణాలు నూనె గ్రంథుల మార్గాలను ఆవరించి ఇరుకుగా చేస్తాయి. దీని పర్యవసానంగా గ్రంథులనుంచి విడుదలైన తైల పదార్థం లోలోపలే పేరుకుపోయి మొటిమగా మారుతుంది. ఒకవేళ బ్యాక్టీరియా దాడిచేస్తే ఇనెఫెక్ట్ అవుతుంది. ఒక మొటిమలో ఇనెఫెక్షన్ చేరితే అక్కడితో ఆగిపోకుండా పరిసరాల్లో ఉండే ఇతర స్వేద రంధ్రాల ద్వారా చుట్టుపక్కల నూనె గ్రంథుల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలా అనతికాలంలోనే ముఖమంతా మొటిమలతో నిండిపోతుంది. బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్, పింపిల్స్, సిస్ట్.. ఇవన్నీ మొటిమలను సూచించడానికి వాడుకలో ఉన్న పదాలు. లక్షణ చిహ్నాలలో తేడాలను బట్టి మొటిమలను ఇలా వివిధ రకాల పేర్లతో వ్యవహరిస్తుంటారు. మొటిమ చర్మం క్రింద తయారై వెలుపలకు తెరుచుకోకపోతే వైట్‌హెడ్ తయారవుతుంది. మొటిమ అగ్రభాగం మూసుకుపోకుండా, శిఖరాగ్రం నల్లగా మారితే బ్లాక్‌హెడ్ తయారవుతుంది. రంధ్రం గోడలు దెబ్బతిని, బ్యాక్టీరియా, మృతకణాలు చేరి, చిన్నపాటి ఇనెఫెక్షన్ ..అంటే ..వాపు, ఎరుపుదనం కలిగిస్తే పింపిల్ తయారవుతుంది. రంధ్రం పూడుకుపోయి ఇనెఫెక్షన్ బాగా లోతుకు వ్యాపిస్తే సిస్టు తయారవుతుంది. బహిష్టు సమయాల్లో హార్మోన్ల తేడాలు సంభవించే మొటిమలకు వైద్యసలహా అత్యవసరం. గర్భధారణ సమయాల్లో హార్మోన్ల అసమతుల్యత చోటుచేసుకోవడంవల్ల ఏర్పడే వాటికి సాధారణారోగ్యాన్ని కాపాడుకుంటే సరిపోతుంది. మొటిమలతో బాధపడే వారిని అధ్యయనం చేసినపుడు వారిలో 15 శాతం మందికి అతి స్వేదం వలన సమస్య జటిలమవడాన్ని అధ్యయనకారులు గమనించారు. వాతావరణం ఉక్కపోతగా, అసౌకర్యంగా ఉన్నప్పుడూ, చుట్టు పక్కల వాతావరణంలో తేమ శాతం పెరిగిపోయినప్పుడూ చాలామందిలో మొటిమలు బయటపడతాయి. స్వేదాధిక్యతను తగ్గించుకోవడానికి వైద్య సలహాలు పాటించాలి.
కొన్నిరకాల మందులు మొటిమలను తీవ్రతరం చేస్తాయి. గర్భనిరోధక మాత్రలు, స్టెరాయిడ్స్, మూర్ఛలను నియంత్రించడానికి వాడే యాంటీ ఎపిలెప్టిక్ మందులు ఈ కోవకి చెందుతాయి. మందుల వల్ల మొటిమలు వస్తుంటే సమస్యను మీ డాక్టర్‌తో చర్చించండి.
.సౌందర్య ఉత్పత్తుల దుష్పలితం , క్రీముల రూపంలో వాడే కాస్పొటిక్ పదార్థాలు జిడ్డుగా ఉంటాయి. ఇవి చర్మపు రంధ్రాలను మూసివేసి కొత్త సమస్యలను సృష్టిస్తాయి. ఇటీవల మార్కెట్‌ను ముంచెత్తుతున్న అనేక రకాలైన సౌందర్య సాధనలలో రసాయనాలే ప్రధానంగా ఉంటున్నాయి. వీటికి అనారోగ్యాన్ని కలిగించే తత్వం ఉంటుంది. అందుకే వీటికి బదులు సహజమైన సౌందర్య పదార్థాలను వాడటం మంచిది. యుక్తవయసులోనే కాకుండా కొన్ని ప్రత్యేక సందర్భాలలో కూడా మొటిమలు రావడానికి ఆస్కారం ఉంది. శరీరంలో అంతఃస్రావ గ్రంథులకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమైనపుడూ, టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ బాగా పెరిగిపోయినప్పుడూ ఇలా జరుగుతుంటుంది. అలాగే మహిళలలో అండాశయాలకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమైనపుడు కూడా మొటిమలు కనిపిస్తాయి. పిట్యూటరీ గ్రంథి వ్యాధిగ్రస్తమైనపుడు కళ్లు మసకలుబారడం, తలనొప్పి, బరువు పెరిగిపోవడం, నెలసరి సక్రమంగా రాకపోవడం, రక్తపోటు పెరగడం వంటి లక్షణాలతో పాటు మొటిమలు కూడా తయారయ్యే అవకాశం ఉంది.
మొటిమల సమస్యలు తీవ్రమైతే ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి . వైద్య సహాయం తప్పకుండా తీసుకోవాలా. ఏయే జాగ్రత్తలు తీసుకుంటే మొటిమలను శాశ్వతంగా నిర్మూలించవచ్చు ?
వాయిస్ ..మానసిక ఒత్తిడి, దుమ్ము, ధూళి, ఎండవేడి, వాతావరణంలో మార్పులూ ఇవన్నీ మొటిమలను తీవ్రతరం చేస్తుంటాయి కనుక ముందు వీటినుంచి దూరంగా
జిడ్డుగా ఉండే మేకప్ క్రీములను వాడకూడదు.మొటిమలను ఎప్పుడూ చేతుల వేళ్ళతో గిల్లకూడదు. ఒకవేళ గిల్లినట్లయితే మొటిమలను తగ్గించుకోవటానికి బదులు ఇనెఫెక్షన్ తగ్గించుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది.ఆహారంలో కారం, పులుపు, మసాలాలు, నూనెలు, వేపుడు పదార్థాలు, కొవ్వు పదార్థాలను తగ్గించాలి. ముఖ్యంగా పిండి పదార్థాలను తగ్గించి వాడుకోవాలి.విరేచనం సాఫీగా అయ్యేలా చూసుకోవాలి. త్రిఫల చూర్ణాన్ని రోజు రాత్రి పూట పడుకునేముందు వేడి నీళ్ళతో చెంచాడు మోతాదుగా పుచ్చుకుంటే విరేచనం సాఫీగా జరుగుతుందని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు .
ఇక ప్లాస్టిక్ సర్జరీ విషయానికి వస్తే దాని వల్ల కలిగే లాభాలేమిటి..ప్రతికూలతలు గురించి తెల్సుకుందాం.. సాధారణంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే వాళ్లు తెలిసి కూడా కొన్ని తప్పులు చేస్తుంటారు. అంటే నైపుణ్యం లేని సర్జన్ల వద్దకు వెళ్లి లేని పోని సమస్యలు కొని తెచ్చుకోవటం సర్వ సాధారణమైపోయింది.
. ప్లాస్టిక్ సర్జరీలో రెండు రకాలు . వాటిలో మొదటిది ఐలిడ్ కాగా , రెండోది బాహ్య శరీరంపై చేసేది . ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే ఎక్కడి లేని అందం వచ్చి పడుతుందని యువతులు ఆశిస్తుంటారు. అప్పుడెప్పుడో బాలీవుడ్, టాలీవుడ్ తారలు రేఖ, శ్రీదేవి , ఆమె సోదరి మహేశ్వరి , పొడుగు కాళ్ల సుందరి శిల్పా శెట్టి తదితరులు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారనే వార్తలు గుప్పు మన్నాయి. కానీ ఆ వార్తల ప్రభావమో , ప్రపంచీకరణ పుణ్యమో తెలియదు కానీ ఇటీవలి కాలంలో మన దేశంలో కూడా ప్లాస్టిక్ సర్జరీచేయించుకోవటానికి సంపన్న యువతులు మొగ్గు చూపుతున్నారు. దీంతో అన్ని ప్రధాన నగరాలు ,పట్టణాల్లో ప్లాస్టిక్ సర్జరీ సెంటర్లు వెలిశాయి. ఐలిడ్ సర్జరీ అంటే కళ్లు రెప్పల మీద , దాని కింది భాగంలో చేసేది. పాశ్చాత్య దేశాల్లో ఇటీవలి కాలంలో ఈ భాగాల్లో టాటూ వేయించుకోవటం ఫ్యాషనై పోయింది. సౌందర్యం పెరిగితే .. తమకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని మహిళలు , యువతులు కలలుగంటారు. ఏదైనా ఫ్యాషన్ షోలో కానీ , సినీ ఛాన్స్ లు దక్కవచ్చని ఊహల్లో వుంటారు. దీని కోసం ఎంత ఖర్చుకైనా సంపన్న యువతులు తెగిస్తారు. ఐలిడ్ సర్జరీ వల్ల కళ్ల వద్ద మనకు కనిపించకుండా దాగివున్న ముడతలను నిర్మూలించవచ్చు. దీంతో మీ కళ్లు కొత్త అందాన్ని సంతరించుకుంటాయి. కళ్ల కింద వుండే నల్లటి చారలు ఇక కనిపించవు. చాన్నాళ్లుగా వేధిస్తోన్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎలాస్టిసిటీని కోల్పోయినప్పుడు ఈ కొవ్వు... చర్మం జారడం వల్ల ఏర్పడ్డ ఆ సంచుల్లోకి ప్రవేశిస్తుంది. దీన్ని సరిచేయడానికి నిర్వహించే సర్జరీని బ్లఫరోప్లాస్టీ ఆపరేషన్ అంటారు. సర్జరీకి ఎవరు అర్హులు... కంటి చుట్టూ చర్మం జారినట్లుగా ఉన్నవారిలో శరీరక, మానసిక ఆరోగ్యం బాగున్నవారు ఈ సర్జరీకి అర్హులు. కొందరిలో చిన్న వయసులోనే అంటే... 35 ఏళ్లకే చర్మం కింద ఇలా సంచులు ఏర్పడతాయి. వాళ్లలో జన్యుపరమైన కారణాలతో వంశపారంపర్యంగా ఇలా జరుగుతుంటుంది. ఇలాంటివారు చిన్న వయసులోనైనా ఈ ఆపరేషన్‌ను చేయించుకోవచ్చు. ఐ-లిడ్ సర్జరీతో కళ్ల కింది ముడుతలు, సంచులు తొలగడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే దీనివల్ల మీ ముఖ సౌందర్యంలో గణనీయమైన మార్పేమీ రాదు. సంచులు పోవడం మినహా మిగతాదంతా మామూలుగానే కనిపిస్తారు. కాబట్టి ఈ సర్జరీకి ముందే మీరు ఈ సర్జరీతో పొందే ప్రయోజనాన్ని బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి. సర్జరీ తర్వాత మీరు కనిపించే తీరుతెన్నులు, దీనిపై మీకు ఉన్న అంచనాలను మీ సర్జన్‌తో సంప్రదించి, అవగాహన పెంచుకోవాలి. ఈ సర్జరీ తర్వాత వయసు పెరగడం వల్ల వచ్చే మార్పులను ఈ ఆపరేషన్ నిరోధించలేదని గుర్తుంచుకోవాలి. అయితే దీనివల్ల వచ్చే ఫలితాలు మాత్రం దీర్ఘకాలమే ఉంటాయి. పై కనురెప్పకు సర్జరీ వల్ల ఒనగూరే ఉపయోగం కనీసం ఐదు నుంచి ఏడేళ్ల పాటు ఉండవచ్చు. ఇక కింది కనురెప్ప విషయంలో మాత్రం చాలా అరుదుగా ఒకటి కంటే ఎక్కువసార్లు చేయించాల్సిన అవసరం రావచ్చు. ఈ సర్జరీ తర్వాత కనురెప్పలకు అయిన గాయాలు మానేవరకు కొద్దిరోజుల పాటు పని నుంచి పూర్తిగా దూరంగా ఉంటూ ఇంట్లోనే ఉండేలా ప్లాన్ చేసుకోవడం అవసరం.ఐతే ఈ సర్జరీ వల్ల ప్రతికూలతలు లేకపోలేదు. ఈ సర్జరీ చేయించుకున్న వారికి కంటి కింది భాగంలో కొవ్వు పెరిగే అవకాశం వుంటుంది. కళ్లు ఎరుపెక్కవచ్చు. రక్తం గడ్డ కట్టవచ్చు. కనుగుడ్డు భాగంలో హెమరేజ్ ఏర్పడి ఒక్కోసారి కంటి చూపు కూడా కోల్పోవచ్చు.
కొంతమందికి కొన్ని కారణాలతో స్వర పేటిక దెబ్బతింటుంది. పైకి వినటానికి బాగానే వున్నా. మాటలు ఎదుటి వారికి స్పష్టంగా అర్ధం కావు . ఇటువంటి వారికి సైతం 'వోకల్ కార్డ్స్'కూ ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారు. ఏవిధంగా మాట్లాడితే మాటలు స్పష్టంగా అర్ధం అవుతాయనే దానిపై సూచనలు , సలహాలు కొన్ని మీకోసం ..
.ఇంటా బయటా రోజూ మనం ఎందర్నో కలుస్తుంటాం. వారిలో రకరకాల మనస్తత్వం కలిగిన వాళ్ళుంటారు. వారి ఆలోచనల్లోనూ చాలా తేడా ఉంటుంది. ఆసక్తి.. . అవసరం. దేనివల్ల నైనా కావచ్చు. వారితో మనం సత్సంబంధాలు నెరపక తప్పదు. అలా చేయగలిగినప్పుడే అందరి కన్నా ముందు ఉండగలం. అందుకే నిపుణులు 'ఆధునిక పోటీ దారు సామర్థ్యాల్లో మాట తీరు ప్రధానమైనది.. అది మన ప్రతిభాపాటవాలను వెలికి తీసే సూత్రధారి అంటున్నారు. ఉద్యోగ వ్యవహారాల నిర్వహణ .. మీటింగ్‌లలో మాట్లాడటం.. సిబ్బందిలో స్ఫూర్తి నింపడం..కెరీర్‌లో దూసుకెళ్లడం.. ఒక్కటేమిటి అన్నీ మాటల చాతుర్యం పైనే ఆధారపడి ఉంటాయి. ఇంత ప్రాధాన్యం ఉంటుంది కనుకే ఇప్పుడు అన్ని దేశాల్లో వాయిస్ వర్క్ షాపులు వెలిశాయి. అమెరికాలో అయితే ఇది మరీ ఎక్కువ. శరీరంలోని ఇతర భాగాలకు చేసినట్లే 'వోకల్ కార్డ్స్'కూ ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారు. దీనికి వాయిస్ ప్రాధాన్యం గురించి వివరించిన ప్రముఖుల వివరణలూ దోహదం చేశాయి. ప్రఖ్యాత వాయిస్ కోచ్ స్టీవ్ హామిల్టన్ ప్రకారం . ఎదురుగా ఉన్న వారినీ, దూరంగా ఉన్న వారినీ కేవలం మాట్లాడిన అంశంతోనే ఆకట్టుకోలేం. అవతలి వారిపై అది కేవలం ఏడు శాతమే ప్రభావం చూపిస్తుంది. అదే మనం కనిపించే తీరు 58శాతం, మాట్లాడే తీరు 38శాతం ప్రభావాన్ని కనబరుస్తుంది.మాట్లాడే విధానం, హావభావాలు, ఉచ్చారణ సరిగా లేకపోతే ఎంత గొప్ప విషయమైనా ఎదుటివారికి బోర్ కొడుతుంది. అందుకే అన్ని రకాల ఉద్వేగాలనూ గళం బలంతో వ్యక్తీకరించాలి అంటారు. . ఆనందం, బాధ, ఆవేశం, ఆత్మవిశ్వాసం.. అన్నీ మన మాటల్లోనే వ్యక్తం చేయవచ్చనే ఆయన మాట తీరును మెరుగు పరుచుకోవడానికి కొన్ని టిప్స్ కూడా చెబుతున్నారు. ఆవేంటంటే.. మనం మాట్లాడుతున్నప్పుడు ఉచ్ఛారణలో ఎక్కడ స్పష్టత లోపిస్తోందో గుర్తించాలి. దాన్ని అధిగమించేందుకు అభ్యాసం చేయాలి.ప్రాక్టీసులో భాగంగా ఏదైనా చదివేటప్పుడు గట్టిగా, స్పష్టంగా ఉచ్చరిస్తూ చదవాలి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు, వారితో ముఖ్యమైన విషయాలను చర్చిస్తున్నప్పుడు కొద్దిగా గొంతు తగ్గించాలి. కానీ స్పష్టంగా మాట్లాడాలి..వివిధ అంశాలపై పట్టు ఉండటం చాలా అవసరం ఆ రకమైన అవగాహన ఉన్నప్పుడే మనలో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. గొంతులో తడబాటు తగ్గుతుంది. మాట్లాడటంలో ఇతరులను అనుకరించడం మంచిది కాదు.

No comments