1

Breaking News

షాంపూలలో వుండే రకాలు ఏమిటి? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు

..ఆధునిక సమాజంలో చోటు చేసుకుంటోన్న మార్పుల్లో భాగంగా మనం షాంపూలు అలవాటు పడ్డాం. కానీ మన పూర్వీకులు అనుసరించిన విధానాలకు తిలోదాకలిస్తున్నాం. గతంలో పెద్దలు వాడిన కుంకుడు కాయలు , నేటి యువతీ ,యువకులకు చికాకు తెప్పిస్తున్నాయి. అయితే  షాంపూలతో  చర్మ , శిరోజాలసౌందర్యాన్ని కోల్పోతున్న   యువతీ ,యువకులు మనసు మార్చుకుని మళ్లీ పాత పద్ధతులను అనివార్యంగా పాటిస్తున్నారు. ప్రపంచీకరణ పుణ్యమా అని టీవిల్లో షాంపూలు , సోపుల ప్రకటనలు హోరెత్తి పోతున్నాయి. వీటిని చూసిన  పేద ,మధ్యతరగతి ప్రజానీకం తాహతు వున్నా , లేకపోయినా వీటికి బానిసలవుతున్నారు. షాంపూ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్ని వున్నాయో , కలిగే దుష్ఫలితాలు ఎలా ఉంటాయో . ఇవాళ్టి ఫర్ దీ పీపుల్ కార్యక్రమంలో చూద్దాం. ముందుగా షాంపూలలో వుండే రకాలు ఏమిటి?  వాటి వల్ల కలిగే ప్రయోజనాలు .. వాటిలో రకాల గురించి ముందుగా తెలుసు కుందాం.
. మంచి ఆరోగ్యకరమైన శిరులు కావాలంటే షాంపూ వాడితే మంచిదని కొందరి అభిప్రాయం.. కానీ వాటి కంటే కుంకుడు కాయలు శ్రేయస్కరమని మన పూర్వీకులు చెపుతున్న మాట. ఈ రెండింటిలో వాస్తవాలు ఎలా వున్నా.. పరుగులు తీసే కాలంతో పోటీపడాలంటే షాంపూతో తలంటుకుంటే సమయం వృధా కాదని నేటి యువతీ ,యువకులు చెప్పే మాట. రింగు రింగులుగా జుట్టు పైకి ఎగరాలంటే షాంపూ స్నానమే బెటరని కొందరి అభిప్రాయం. కానీ జుట్టు నాణ్యంగా ,మన్నికగా వుండాలంటే కుంకుడు కాయలు మంచివని అనుభవజ్ఞలు చెపుతుంటారు. పూర్తిగా తలపై భాగాన్ని శుభ్రపరిచే రకం ఒకటైతే , చుండ్రు బారినుంచి విముక్తి చేసేది మరో రకం , జుట్టు నిగారింపును పెంచేవి ఒక రకమైతే , బేబీ షాంపూ వాడితే చిన్నారులకు కళ్ల వెంట చుక్క నీరు రాదు. ఏ షాంపూ కు వుండే ప్రత్యేకత దానిదే..
తలపై భాగాన్ని శుభ్రపరిచే షాంపూతో జిడ్డును వదల్చటానికి దోహద పడుతుంది. షాంపూలలో డిజర్టెంట్లు కలవటం వల్ల ఎంతటి జిడ్డునైనా సునాయాసంగా పోగొడతాయి. మంచి నురగతో మురికిని తొలగిస్తాయి. వారానికి రెండు సార్లు షాంపూ స్నానం చేస్తే వాతావరణ కాలుష్యం వల్ల పేరుకుపోయే రసాయనాలను తొలగించవచ్చు. సిగరెట్ తాగేవారు , అద్లెట్లు  తరచుగా షాంపూ స్నానం చేయటం వల్ల వారి శిరులు ఆరోగ్యంగా వుంటాయి. రోజువారీ కార్మికులు , వాహనాలు నడిపే డ్రైవర్లు , రసాయన పరిశ్రమల్లో పని చేసే వారు తలపై పేరుకు పోయిన వ్యర్ధాలను పోగొట్టడుకోవటానికి రోజు వారీ తల స్నానం చేయటం మంచిది.
కొన్ని రకాల షాంపూలు ద్రవ రూపంలోనూ , ఫోమ్ లాను వుంటాయి.  మీరు తలంటు స్నానం చెయ్యటానికి, షాంపూ ప్యాకెట్స్ వాడేవాళ్ళు అయితే ఈ క్రింది సూచనని ఫాలో అయిపోండి. సాధారణముగా ఈ షాంపూ సాచెట్స్ తో తలంటు కుంటున్నప్పుడు కాసింత షాంపూ వంపుకున్నాక, ఆ మిగిలిన సాచెట్ ని ఎక్కడ పెట్టాలో కాసింత ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఇబ్బందిని ఇలా తొలగించుకోవచ్చును. చూడటానికి సరదాగా అనిపించినా, ఒక ఉపయోగకర విషయం ఇది.
షాంపూ బాటిల్ కన్నా షాంపూ సాచేట్స్ ని వాడితే చాలా డబ్బు పొదుపు అవుతుంది. కారణం  డబ్బా ప్యాకింగ్ మీద ఉన్న పన్నులు.  ఈ సాచెట్స్ వాడితే, షాంపూ వాడకం కూడా హద్దుల్లో ఉంటుంది అనుకొని, వాడకం కూడా ఎక్కువే.
 జుట్టు  సంరక్షణకు ఖరీదైన షాంపూ వాడితే సరిపోతుందిలే అంటూ పలువురు ధీమా వ్యక్తం చేస్తుంటారు. నిజానికి ఇది అపోహ మాత్రమే.. మీరు రోజు షాంపూతో తల స్నానం చేసినా, కాలుష్యం బారి నుంచి మీ జుత్తును సంరక్షించుకోవడమన్నది కష్టతరమైన అంశం.  కేవలం షాంపూల మీద ఆధారపడకుండా, వ్యక్తిగతంగా మీ జుట్టును సంరక్షించుకునేందుకు శ్రద్ధ చూపాలి.షాంపూను నేరుగా కురులకు ఆప్లై చేయకండి, ఈ విధానం జుత్తుకు హాని తలపెడుతుంది. షాంపూను ముందుగా మగ్ నీటిలో కలుపుకుని ఆ తరువాత జుట్టు  ఆప్లై చేయండి.ముఖ్యంగా ఆడవారు తమ కురుల పోషణలో భాగంగా హెన్నా  , ఆలివ్‌ ఆయిల్‌తో కండిషనింగ్‌ అవసరం.జుట్టు  సంరక్షణలో భాగంగా ఎవరికి వారు దువ్వెన, బ్రష్ వంటి పరికరాలను వేరు వేరుగా వాడటం మంచిది. నిగనిగలాడుతూ, గాలికి ఆరోగ్యంగా ఎగురుతూ ఉండే జుట్టు అంటే ఇష్టపడని వారుండరు. ఈ బిజీ లైఫ్‌లో కుంకుడుకాయతో తలస్నానం చేసే అవకాశం లేక చాలామంది షాంపూలను వాడుతుంటారు. ఎలాంటి షాంపూ ఎంచుకోవాలనే విషయం మీద చాలామందిలో గందరగోళం ఉంటుంది. టీవీలో వచ్చే రకరకాల షాంపూలు, కండిషనర్లు వాడితే జుట్టులో పడినట్లే చిక్కులు ఎదురుకావచ్చు. అన్ని షాంపూలు మంచి చేయకపోవచ్చు. కాబట్టి వాటి ఎంపికలో, వాడటంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. షాంపూ, కండిషనర్లకు సంబంధించిన అనేక అంశాలపై అవగాహన ఎలా ఉండాలి. కేవలం జుట్టును, తలను శుభ్రం చేసే ప్రతిదీ మంచి షాంపూ అనుకుంటే పొరపాటు. అపాయకరం కానిదే మంచి షాంపూ. దాంతో తలంటుకున్న తరవాత జుట్టును దువ్వెనతో తేలికగా దువ్వుకోగలగాలి. జుట్టు అడ్డదిడ్డంగా ఎగిరిపోకుండా, చూడటానికి అందంగా ఉండాలి. రుద్దుకున్న తరవాత, తలంతా తేలికయినట్టుగా, మనసుకు హాయిగా అనిపించాలి. తలకి ఉన్న జిడ్డు, మట్టి, మృతచర్మం, దుమ్ము, ధూళి వంటివాటిని పోగొట్టాలి. ఇవన్నీ ఉంటే అది మంచి షాంపూ. షాంపూ వాడకంలో ఏఏ జాగ్రత్తలు పాటించాలి .షాంపూ వాడితే జుట్టు కుప్పలా ఒక్కచోటికి రాకూడదు. కండిషనర్స్ తరచూ వాడుతూండాలి. ఇవి జుట్టును... ఎండిపోయి, పీచులా తయారవ్వకుండా కాపాడతాయి.జుట్టును కింద నుంచి దువ్వుకుంటూ రావాలి. ముందరే కుదుళ్ల దగ్గర దువ్వడం మొదలుపెడితే జుట్టంతా ఒకచోటుకి వచ్చి చిక్కుపడిపోతుంది.కండిషనర్లను ఎక్కువగా ఉపయోగిస్తే జుట్టు చూడటానికి మెరుస్తున్నప్పటికీ, సమంగా దువ్వుకోవడం కుదరదు. చుండ్రు పెరిగే అవకాశం కూడా ఉంది.షాంపూలు, కండిషనర్ల గురించిన అవగాహన ఏర్పడితే ఎటువంటి వాటిని ఎంచుకోవాలో తెలుస్తుంది. తద్వారా జుట్టును సంరక్షించుకోవడం సాధ్యమవుతుంది.

 షాంపూలో ఏమేమి కలుపుతారు వాటి వల్ల ముప్పు ఏమైనా వుంటుందా ? శీతాకాలంలో తరచుగా తల స్నానం చేయవచ్చా.. చేస్తే ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి.
 షాంపూలలో ముఖ్యంగా సర్ఫ్‌యాక్టెంట్ , కో- సర్ఫ్‌యాక్టెంట్, ఉప్పు, సుగంధాన్నిచ్చే వస్తువు లను వాడతారు. సర్ఫ్‌యాక్టెంట్‌లలో సోడియమ్ లారిల్ సల్ఫేట్, సోడియమ్ లారేట్ సల్ఫేట్, అమోనియమ్ లారిల్ సల్ఫేట్, అమోనియమ్ లారేట్ సల్ఫేట్ వంటివి ఉంటాయి. సర్ఫ్‌యాక్టెంట్లు జుట్టు మీది మురికిని పోగొట్టి, నురగ వచ్చేలా చేసి, తలను శుభ్రం చేస్తాయి. కో-సర్ఫ్‌యాక్టెంట్‌లు... షాంపూ చిక్కని ద్రవంలా తయారవ్వడానికి ఉపయోగపడతాయి. సోడియం క్లోరైడ్ వంటివి షాంపూలోని చిక్కదనం అంతటా సమంగా ఉండేలా చేస్తాయి. గ్లైకోల్ స్టిరేట్ వంటి వ్యాక్స్‌లు... షాంపూలను ముత్యం రంగులో మిలమిలలాడేలా  చేస్తాయి. వీటిలో ఇంకా ఇతర విటమిన్లు, ప్రోటీన్లను కలుపుతారు. షాంపూ తయారీలో... విటమిన్ ఇ లేదా టోకోఫెరోల్ వంటివాటిని సాధారణంగా వాడుతూండటం చూస్తాం. శీతాకాలం వచ్చిందంటే చాలు జుట్టు పొడి బారుతుంది. ఓ పట్టాన చిక్కుముడులు వీడవు. ఉదయాన్నే బైటికి వెళితే చల్లగాలులు వెంటాడుతాయి. తలస్నానం చేస్తే త్వరగా ఆరవు, చల్లగాలుల ప్రభావం శరీరం, చర్మం, కేశాలపై వీటి ప్రభావం ఉంటుంది. అందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి. శీతాకాలంలో స్వచ్ఛమైన కొబ్బరి నూనెను కొద్దిగా వేడిచేసి కుదుళ్లకు ఇంకేలా రాయాలి. మోరాక్కాన్‌ ఆయిల్‌ కుదుళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లేకపోతే ఆలివ్‌ ఆయిల్‌ను వారానికి ఒకసారి రాయాలి. ఉలెన్‌ క్యాప్‌ లకు, స్కార్వ్‌ లకు సాటిన్‌,  సిల్క్‌ కవర్‌ వుంటే కురులకు మెత్తగా ఉంటుంది. ఎక్కువ షాంపూ తీసుకో కూడదు. గోరు వెచ్చని నీటినే తలకు ఉపయోగించాలి. వేడినీళ్లు వాడరాదు. ముఖ్యంగా షాంపూ వాడకాన్ని శీతాకాలంలో తగ్గించాలి. హెయిర్ స్పా.. ప్రతి రెండు వారాలకు ఒకసారి తలకు ఆయిల్‌ మసాజ్‌ చేయాలి. స్టీమింగ్‌ మంచిది. కొబ్బరి నూనె, ఆల్మండ్‌, ఆలీవ్‌, జొజోబా, జాబొరాండీ ,  రోజ్‌ మేరీ ఆయిల్‌ మంచిది. వీటిని మసాజింగ్‌కు ఉపయోగించాలి. డ్రైయర్స్‌ వాడరాదు. శీతాకాలంలో డ్రైయర్లు వాడితే కురులు పాడవుతాయి. సహజ సిద్ధంగా ఆరనివ్వాలి, అంటే మెత్తటి టవల్‌ తో కురులను మృదువుగా తుడవాలి.ప్లాస్టిక్‌ దువ్వెన్లకు నోః ప్లాస్టిక్ దువ్వెనలను కురులకు ఉపయోగించరాదు. దూరంగా పళ్లుగల ఉడెన్‌ దువ్వెనలను వాడాలి. జుట్టు తడిగా వుంటే దువ్వరాదు. కండిషనింగ్‌ అవసరం.  తల స్నానం తర్వాత కండిషనింగ్‌కు కొబ్బరిపాలను వాడాలి. టవల్‌తో డ్రై తర్వాత వాడాలి. గోరువెచ్చని నీటినే తలస్నానానికి ఉపయోగించాలి.  వెనిగార్‌ ,  రసాయనాలు లేని క్రీమ్‌ను వాడాలి.

..కండిషనర్లలో రకాలు. ఏమిటి మరి వాటిని ఎలా వాడాలి? వీటిలో ఏమి వుంటాయి.

వాయిస్ .. కండిషనర్లలో రిన్స్, లీవ్ ఆన్, డీప్... అని మూడు రకాలు ఉంటాయి. రిన్స్ కండిషనర్లను జుట్టు పై భాగాన  అప్లై చేయగానే తేలిగ్గా పరుచుకున్నట్టు అవుతాయి. ఇవి కర్లీ జుట్టు వారికి మంచిది. షాంపూతో తల రుద్దుకుని, తలను తువ్వాలుతో తుడుచుకున్న తరవాత లీవ్ ఆన్ కండిషనర్లను ఉపయోగిస్తారు. అంతేకాని తల స్నానం పూర్తికాగానే ఉపయోగించరు. ఇవి జుట్టును, తలను మృదువుగా చేసి, జుట్టుకి కొత్త మెరుపును, అందాన్ని ఇస్తాయి. జుట్టులోని గరుకుతనం పోయి, వదులుగా అందంగా తయారవుతుంది. అయితే వీటిని సరిగా వాడకపోతే కనక చుండ్రు సమస్య ప్రారంభం అవుతుంది. డీప్ కండిషనర్లు... జుట్టును క్రీమీగా, వదులుగా చేస్తాయి. వాటిని కొన్ని సమయాలలో మాత్రమే వాడాలి. వాడిన వెంటనే షాంపూతో తల రుద్దుకోవాలి. వీటిలో గ్లిజరిన్, హైడ్రోలైజ్‌డ్ ప్రొటీన్స్ వంటి మాయిశ్చరై జర్లు ఉంటాయి. జుట్టు బాగా ఎండినట్టుగా, చిట్లిపోయినట్టుగా ఉన్నప్పుడు ఇవి ఉపయోగపడతాయి.షాంపూతో తల రుద్ది, తువ్వాలుతో తుడుచుకున్న తరవాత కండిషనర్లను ఉపయోగించాలి. వీటిని తల మీద అప్లై చేసేటప్పుడు వెంట్రుక కుదురు దగ్గర నుంచి, కింది వరకు జుట్టుకు పట్టేలా జాగ్రత్తపడాలి. అప్లై చేసిన కొన్ని నిముషాల తరవాత జుట్టును నీటితో శుభ్రపరుచుకోవాలి.షాంపూతో తల రుద్దుకున్న తరవాత జుట్టు పీచులా ఎగిరిపోకుండా, అణచి ఉంచడానికి ఉపయోగించేవాటిని కండిషనర్లు అంటారు. అంటే జుట్టును మంచి కండిషన్‌లో ఉంచేవన్నమాట. ఇవి జుట్టును మెరిసేలా, మృదువుగా, చేతికి లొంగేలా ఉంచుతాయి. అదేవిధంగా క్యూటికిల్‌ను మృదువుగా, జారిపోయేలా చేస్తాయి. ఇవి బయటి క్యూటికిల్ మీద ఒక కోటింగ్‌లా ఏర్పడి, వాతావరణంలో కలిగే మార్పుల నుంచి, ఇతరత్రా ఇబ్బందుల నుంచి రక్షిస్తాయి. జుట్టు చిట్లిపోకుండా, చిక్కులు పడకుండా కాపాడుతూ... కొత్త మెరుపును, అందాన్ని తీసుకువస్తాయి.
సర్వసాధారణంగా కండిషనర్లలో సిటైల్ ఆల్కహాల్, సెట్రిమోనియమ్ బ్రోమైడ్‌లను ఉపయోగిస్తారు. కండిషనర్లను జుట్టు మీద అప్లై చేసినప్పుడు ఈ సిటెల్ ఆల్కహాల్ జుట్టు మీద ఒక పొరలా ఏర్పడి జుట్టుకు అందాన్నిస్తుంది. దానివల్ల జుట్టు తడిగా ఉండగానే తేలికగా దువ్వుకోగలుగుతాం. సెట్రిమోనియమ్ బ్రోమైడ్ లేదా క్లోరైడ్... యాంటీ స్టాటిక్‌గా ఉండి, జుట్టు మెరుపును మెరుగుపరుస్తుంది. అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో ఉంటాయి. షాంపూ వాడకం ద్వారా తలకు పెట్టిన నూనె పోయి, ఆ నూనెకు బదులుగా ఇవి సహజమైన నూనె జిడ్డుగా ఉపయోగపడతాయి. ... గ్రీజు వంటి జిడ్డు పదార్థాన్ని తొలగించి, జుట్టును మృదువుగా ఉండేలా చేస్తాయి. జుట్టు మీద కాంతి పడగానే మెరుస్తుంది. సిట్రిక్ యాసిడ్ అనేది అసిడిఫయర్. దీనిని కండిషనర్లలో అప్పుడప్పుడు ఉపయోగిస్తారు. పునర్ నిర్మాణంలో  సాధారణంగా హైడ్రోలైజ్‌డ్ ప్రొటీన్ ఉంటుంది. ఇది కండిషనర్‌ని జుట్టులోనికి చొచ్చుకునిపోయేలా చేసి, జుట్టును గట్టిపరుస్తుంది. కండిషనర్లలో సాధారణంగా కెటియోనిక్ సర్ఫ్‌యాక్టెంట్‌లు ఉంటాయి. ఇవి జుట్టును పూర్తిస్థాయిలో శుభ్రపరచలేవు. కేవలం జుట్టుకు కావలసిన ప్రొటీన్లను మాత్రమే అందచేస్తాయి. పాంథెనాల్ వంటి మాయిశ్చరైజర్లు క్యూటికిల్‌ను తేమగా ఉంచుతాయి. అందువల్ల జుట్టు నిలబడిపోకుండా వదులుగా గాలిలో తేలుతున్నట్టుగా ఉంటుంది. సెటిల్ ఆల్కహాల్, ఒలెయిల్‌ఆల్కహాల్, స్టెర్లీ ఆల్కహాల్ వంటి లాంగ్ చెయిన్ ఫ్యాటీ ఆల్కహాల్స్ జుట్టుకు లూబ్రికెంట్లగా పనిచేస్తాయి.
          

No comments