1

Breaking News

Gas Subsidies

Gas Subsidies
 సంస్కరణలకు పచ్చజెండా ఊపిన ప్రభుత్వం ఇప్పుడు వంట గ్యాస్ పై కూడా క్రమక్రమంగా సబ్సిడీని ఎత్తేసే దిశగా పావులు కదుపుతున్నట్లుంది. ఇప్పటికే వచ్చే ఏప్రిల్ నుంచి ప్రతి వినియోగదారుడికి ఏడాదికి ఆరు సిలెండర్లు మాత్రమే సరఫరా చేయాలని నిర్ణయించిన సర్కార్... తాజాగా ఆ కాస్త రాయితీని కూడా ఎత్తేయడానికి సిద్ధపడుతుంది. సబ్సిడీ దుర్వినియోగమవుతుందని భావిస్తున్న చమురు కంపెనీలు వినియోగదారులందరికీ సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలెండర్లనే సరఫరా చేయాలని నిర్ణయించాయి. ఈ నిబంధన అమల్లోకి వస్తే గ్యాస్ బండకు ప్రతీ ఒక్కరూ తొమ్మిది వందల ఆరవై ఏడు రూపాయలు చెల్లించాల్సిందే. అంటే ఇప్పుడున్న ధరతో పొల్చితే అదనంగా ఐదు వందల యాభై నాలుగు రూపాయలు వదిలించుకోవాలి. ఇక చమురు కంపెనీల నిర్ణయానికి ప్రభుత్వం కూడా ఆమోద ముద్ర వేస్తే వచ్చే ఏప్రిల్ నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది. అయితే ఈ విధానంపై ఆందోళనపడక్కర్లేదని చమురు కంపెనీలు చెబుతున్నాయి. అర్హులైన వారికి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని వారి బ్యాంక్ అకౌంట్లో వేస్తామని అంటున్నాయి. అయితే సబ్సిడీయేతర సిలెండర్ ధర నెలనెలా మారే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంక్ ల ద్వారా ఎంత మొత్తం చెల్లిస్తామనేది చమురు కంపెనీలు ఇంకా ప్రకటించలేదు. ఇవన్నీ అమలైతే వినియోగదారుల నెత్తిన బండ పడటం ఖాయంగా కనిపిస్తుంది.

No comments