రాష్ట్ర రాజకీయాన్ని కొత్త సెంటిమెంట్ కుదిపేస్తోంది
రాష్ట్ర రాజకీయాన్ని కొత్త సెంటిమెంట్ కుదిపేస్తోంది. యాత్రల సీజన్ లో ఇపుడు మళ్లీ అదే మాట వినిపిస్తోంది. చంద్రబాబు మీకోసం యాత్ర మొదలు కాంగ్రెస్ ప్రకటన ల వరకూ అన్నిట్లోనూ అదే సెంటిమెంట్. మన నేతలకి అదంటే ఎందుకు ఇంత ఎటాచ్ మెంట్ ? ఈ సెంటిమెంట్ స్టోరీ ఏంటో చూద్దాం !
ఎటుచూసినా అదే సెంటిమెంట్ !
హామీ ఇచ్చినా... యాత్ర చేసినా అదే లెక్క !
రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఈక్వేషన్ !
పాదయాత్రల సీజన్ లో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మాట వినిపిస్తోంది. చంద్రబాబు అధికారం పోవడంలోనూ... రాష్ట్రంలో ప్రభుత్వం మారడంలోనూ అదే అంకె కనిపిస్తోంది. మళ్లీ ఇపుడు ఎన్నికలు దగ్గర పడడంలోనూ అదే నంబర్ సెంటిమెంట్ ఉందంటున్నారు కొందరు నేతలు. రాజకీయాల్లో మళ్లీ తొమ్మిది సెంటిమెంట్ ప్రస్తావన వస్తోంది.
చంద్రబాబు పాలన తొమ్మిదేళ్లు
కాంగ్రెస్ కి అధికారం దాదాపు తొమ్మిదేళ్లు
వైఎస్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలు తొమ్మిది !
ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకి సుమారు తొమ్మిదేళ్లు !
మరోసారి మార్పుకి ఇదే తొమ్మిదేళ్లు కీలకం అవుతాయా ?
ఇపుడు ఇలాంటి లెక్కలే వేస్తున్నారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ముందస్తుకి వెళ్లి ప్రతిపక్షానికి పరిమితం అవ్వడం మొదలుపెడితే ఇపుడు రాష్ట్రంలో కాంగ్రెస్ వరుసగా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోబోతోంది. వచ్చే వేసవి నాటికి తొమ్మిదేళ్లు పూర్తవుతాయి. ఆ వెంటనే ఎన్నికలు వచ్చినా రావొచ్చని కాంగ్రెస్ ముందస్తుకి వెళితే ఇదే లెక్క నిజం అవుతుందని అంటున్నాయ్ రాజకీయ వర్గాలు. ఇదో కోణం. దీనికితోడు... ఆ ఎన్నికల్లో లెక్క మారుతుంది అనుకున్నా అది కూడా తొమ్మిదేళ్ల తర్వాత అనే లెక్కవేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎలా చూసినా తొమ్మిదే టర్నింగ్ పాయింట్ అవుతోంది.
హామీల్లోనూ తొమ్మిది ప్రస్తావన !
వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ !
కొత్తగా సబ్సిడీ గ్యాస్ సిలెండర్లు తొమ్మిది !
హామీల్లోనే కాదు ఇప్పుడు అమలవుతున్న పథకాల్లోనూ తొమ్మిది సెంటిమెంటే కనిపిస్తోంది. ఇలా అన్నిట్లోనూ తొమ్మిది మాటే వినిపిస్తోంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలకమైంది తొమ్మిది గంటల విద్యుత్ హామీ. ఇపుడు చంద్రబాబు కూడా పాదయాత్రలో అదే మాట చెబుతున్నారు. కొత్తగా గ్యాస్ సిలెండర్ల సబ్సిడీ విషయంలోనూ ప్రభుత్వం కాస్త విడుపు ధోరణితో వెళుతోంది. అందుకే ఇపుడు సిలెండర్ల సంఖ్య కూడా తొమ్మిదికి పెరిగింది. అంటే హామీల్లోనూ పథకాల్లోనూ అదే మాట వినిపిస్తోందన్నమాట !
సెంటిమెంట్ పై పార్టీల్లో కొత్త ఆలోచనలు
రాజకీయం ఎలాంటి మలుపు తిరగబోతోంది ?
ఇదే చూడాలి. అన్నిట్లోనూ కనిపిస్తున్న సెంటిమెంట్ రాజకీయాలపై ప్రభావం చూపిస్తుందనే మాట పార్టీల్లో వినిపిస్తోంది. విపక్షాలకి పోటీగా కాంగ్రెస్ కూడా జనంలోకి వెళ్లాలనే ఆలోచన చేస్తోందిప్పుడు. అటు కేంద్రంలో ముందస్తు మాట వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఏ మాత్రం త్వరపడినా... తొమ్మిది సెంటిమెంట్ నిజమైనట్టే !
No comments