కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాపై టీఆర్ఎస్ ఫైర్
కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాపై టీఆర్ఎస్ ఫైర్ అయింది. ఉద్యమాన్ని, ఉద్యమనాయకుడిని కించపర్చారని ఆరోపించింది. పూరీ ఆఫీసుపై దాడికి దిగిన టీఆర్ఎస్వీ కార్యకర్తలు... మళ్లీ ఇలాంటి సినిమాలు తీస్తే బట్టలూడదీసి కొడతామని హెచ్చరించారు.
సినిమా రగడ
కెమెరామెన్ గంగతో రాంబాబుపై టీఆర్ఎస్ ఫైర్
పూరీ జగన్నాథ్ ఆఫీసుపై టీఆర్ఎస్వీ దాడి
తెలంగాణ ఉద్యమాన్ని కించపరిస్తూ...కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాను తీశారని టీఆర్ఎస్ మండిపడింది. ప్రజా ఉద్యమాలకు వ్యతిరేకంగా సినిమా రంగాన్ని వాడుకోవడం దురదృష్టకరమని టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి జగదీష్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో బలవంతంగా ఈ సినిమాను ప్రదర్శిస్తే జరగబోయే పరిణామాలకు దర్శక, నిర్మాతలే బాధ్యత వహించాలన్నారు. అటు పూరీ జగన్నాథ్ పై తీవ్రస్థాయిలో మండిపడిన టీఆర్ఎస్ నేత శ్రావణ్... ఇలాంటి పిచ్చి సినిమాలు తీస్తే బట్టలూసి కొడతామని హెచ్చరించారు. దర్శక, నిర్మాతలతోపాటు సినిమా నటీనటులు కూడా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజలను, ఉద్యమాన్ని, ఉద్యమనేతలపై పూరీ జగన్నాథ్ పరోక్షంగా సమైక్య విషం కక్కారని టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు సుమన్ అన్నారు. పూరీజగన్నాథ్‌కు తగి బుద్ధి చెబుతామని సుమన్ హెచ్చరించారు. పూరీ జగన్నాథ్ ఆఫీసుపై దాడి చేసిన టీఆర్‌ఎస్వీ విద్యార్థులు ..కార్యాలయం ఆవరణలో ఉన్న నాలుగు కార్ల అద్దాలు పగులగొట్టారు. ఆఫీసులోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.
పూరీ. పవన్ల తీరుపై తెలంగాణ మాలమహానాడు కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. బలవంతం తెలంగాణ సినిమాను ఆడిస్తే... థియేటర్లను సైతం తగులబెడతామని హెచ్చరించారు... టీ.మాలమహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్... పద్ధతి మార్చుకోకుంటే పూరీ జగన్నాద్ ను తన్ని తరిమేస్తామన్నారు.
బైట్ః అద్దంకి దయాకర్, తెలంగాణ మాలమహానాడు అద్యక్షుడు
ఇదే కాకుండా హైదరాబాద్, వరంగల్ సహా తెలంగాణ అంతటా సినిమాకు నిరసనలు వెల్లువెత్తాయి. కోన్ని చోట్ల సినిమా రీళ్లకు కూడా తెలంగాణవాదులు తగులబెట్టారు. కటౌట్ల ను ధ్వంసం చేసి... దాడులు చేశారు.
No comments