1

Breaking News

హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఉత్సవాలు

హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించుకునేందుకు హైకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. సాయంత్రం అయిదు గంటల నుంచి పది గంటల వరకూ ఉత్సవాలు జరుపుకోవచ్చని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ జాతరకు పోలీసులు అనుమతించకపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తమ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా చేపడుతున్న ఊరురా బతుకమ్మ జాతర కార్యక్రమంలో చివరి రోజైన అక్టోబర్ 23న ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఉత్సవాలకు పోలీసులు ఆనుమతించక పోవట చట్టవిరుద్దమని ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు.

No comments