సక్సెస్ ఫుల్ కోచ్‌కు రాజ్యసభ!
బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్‌కు అదృష్టం కలిసిరానున్నట్లు తెలుస్తోంది.. రాష్ర్టపతి కోటాలో ఆయన్ను రాజ్యసభకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి.. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ వారంలో గోపిచంద్ రాజ్యసభకు నామినేట్ కావడం ఖాయమని కూడా అధికారవర్గాల సమాచారం.. రాష్ర్టపతి తన కోటాలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను రాజ్యసభకు ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తుంది.. క్రికెట్ గాడ్ సచిన్‌కూడా అలా వెళ్లిన వారే.. ఈ సారి ఆ లక్ గోపీచంద్‌కు పట్టనున్నట్లు సమాచారం.. గోపిచంద్ అకాడమీ తరపున సైనా, సింధు ఒలింపిక్స్‌లో మెడల్స్ సాధించిన విషయం తెల్సిందే! ఈ నేపథ్యంలో గోపిచంద్ రాజ్యసభకు వెళ్తే బాగుంటుందని భావించిన సచిన్ మధ్యవర్తిత్వం నెరపినట్లు తెలుస్తోంది.. ఏపీకి చెందిన గోపీచంద్ తెలంగాణలో సెటిల్ కావడంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఈ ప్రపోజల్‌ను కేంద్రం ముందు ఉంచినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.. కేంద్రం నిర్ణయంతో రాజ్యసభసభ్యుడిగా గోపిచంద్ ఎన్నిక సునాయాసమే!
No comments