1

Breaking News

సినీ హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య కేసులో కొత్త మలుపు

సినీ హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య కేసులో కొత్త మలుపు
సినీ రంగంలో పెద్దల కుట్రకు బలయ్యాడని ఫిర్యాదు
చిరంజీవి,దిల్ రాజు, అల్లు అరవింద్,దగ్గుబాటి కుటుంబాలపై ఆరోపణ
అసలు ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయాడు? అతని మరణానికి కారణాలేమిటీ? సినీ రంగంలో పెద్దలకుట్రకు బలయ్యాడా? ఆత్మహత్యకు ప్రేరేపించిన పరిస్ధితులేమిటీ? అనే ప్రశ్నలు సినీ అభిమానుల మెదళ్లును తొలుస్తున్నాయి. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై స్పెషల్ రిపోర్టు..

సినీహీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య కేసు మలుపులు తిరుగుతోంది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు నలుగురు ప్రముఖులు కారణమంటూ ఓ న్యాయవాది మానవహక్కుల కమిషన్ లో పిటీషన్ దాఖలు చేయడంతో టాలీవుడ్ లో ప్రకంపనాలు మొదలయ్యాయి..మరోవైపు ఉదయ్ కిరణ్ కు కోట్లాది రూపాయల ఆస్తులున్నాయని, అతడు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదన్న అతని తండ్రి మాటలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి..
వాయిస్..హీరో ఉదయ్ కిరణ్ గత రాత్రి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త సినీ అభిమానులను ఎంతగా కలచివేసిందో, అతని మరణానికి సినీరంగానికి చెందిన కొందరు పెద్దలు కారణమన్న ఆరోపణలు అంతే అలజడికి కారణమయ్యాయి..గత నాలుగేళ్లుగా ఉదయ్ కిరణ్ తో మాటలు బంద్ చేసిన అతని తండ్రి వివికే మూర్తి మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు.
ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వెనుక ఏదో బలమైన కారణం ఉందన్నారు. హైదరాబాద్ లో అతడికి కోట్ల రూపాయలు ఆస్తులున్నాయని తెలిపారు.
ఉదయ్ కిరణ్ ఆత్మహత్య సంఘటనపై అనుమానాస్పదమృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని, విచారణలో తేలిన అంశాల ఆధారంగా కేసులో సెక్షన్లు మార్చుతామని ఇప్పటికే వెస్ట్ జోన్ డిసిపి ప్రకటించారు.
ఇదే సమయంలో మానవహక్కుల కమిషన్ లో ఉదయ్ కిరణ్ మృతికి సంబంధించి ఒక ఫిర్యాదు నమోదైంది. కేంద్ర మంత్రి, సినీ నటుడు చిరంజీవి, అతని బావమరిది అల్లు అరవింద్,దగ్గుబాటి కుటుంబాలతో పాటు, నిర్మాత దిల్ రాజు గత కొన్నేళ్లుగా ఉదయ్ కిరణ్  కు సినిమాలు రాకుండా  పరోక్షంగా చేశారని, అందుకే అతను ఆత్మహత్య చేసుకున్నాడని, అతని మరణానికి కారకులైన వీరందరిపై చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది అరుణ్ ఫిర్యాదు చేశారు..
పదమూడేళ్ల క్రితం లవర్ బాయ్ గా సినీరంగంలోకి వచ్చిన ఉదయ్ కిరణ్ మూడేళ్లలోనే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు. అనేక హిట్ సినిమాల్లో నటించాడు. అదే సమయంలో ఒక అగ్రనటుని కుమార్తెతో వివాహ విషయం అతని జీవితంలో కీలకమలుపుకు కారణమైంది. తెరవెనుక ఏం జరిగిందో ఎవరికి తెలియదు.. కానీ, ఆ అగ్రనటుని కుటుంబానికి ఉదయ్ శత్రువయ్యాడు. ఇక, అంతే అతని పతనం ప్రారంభమైంది. అవకాశాలు తగ్గాయి..కొన్ని సినిమాలు చేసినా, వాటిని ధియేటర్ల లో రిలీజ్ చేసుకోకుండా కొందరు పెద్దలు అడ్డుపడేవారు..తెలుగులో అవకాశాలు తగ్గడంతో తమిళం వైపు దృష్టి సారించిన ఉదయ్ అక్కడ కొన్ని సినిమాలు చేసినా, అక్కడ ఇక్కడి పెద్దల పలుకుబడి బాగానే పనిచేసింది. అక్కడ కొత్త అవకాశాలు రాని పరిస్థితి.
ఇలాంటి సమయంలో అతని తల్లి చనిపోయింది. తండ్రితో మాటలు బంద్ అయ్యాయి. ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. అయినా, సినీ రంగంలో అతనో దురదృష్టవంతుడుగా మిగిలిపోయాడు. అవకాశాలు లేక,వచ్చే ఒకటి,రెండు సినిమాలకు ధియేటర్లు దొరకనియ్యకుండా చేసి అతని పతనానికి కొందరు పెద్దలు పనికట్టుకుని ప్రయత్నించారనే విమర్శలు ఇప్పటికే సినీ రంగంలో తెరవెనుక విన్పిస్తూనఏ ఉన్నాయి. ఈ క్రమంలో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడం, హెచ్ ఆర్ సీలో పెద్దల పై ఫిర్యాదు రావడంతో ఈ కేసు ఇంకా ఏ మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే..

No comments