ఎవరైనా కట్టుబడాల్సిందే: బొత్స
ఎవరైనా కట్టుబడాల్సిందే: బొత్స
హైదరాబాద్ : కాంగ్రెస్ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్టీ నేతలందరూ కట్టుబడాల్సిందేనని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వాన్ని ఎవరూ
ధిక్కరించినా చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇచ్చినట్లు తెలిపారు. ఇక జేసీ ఇచ్చే వివరణ ఆధారంగా
చర్యలు సుకుంటామన్నారు. ఊసరవెల్లి రాజకీయాలు చేసేవారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధిచెబుతారని బొత్స మండిపడ్డారు. ఇతర పార్టీల్లోకి వెళ్లాలనుకునేవారి పూర్తి వివరాలు జిల్లాలవారీగా
జాబితా నా దగ్గర ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకూ గోప్యంగా ఉంచడం జరిగిందని.. ఒకవేళ ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని పీసీసీ చీఫ్
కుండబద్దకొట్టారు. రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలూ కారణమని వివరించారు. జిల్లాలోని పార్టీ నుంచి ఏ ఒక్కవ్యక్తి వెళ్తే బలహీనమైనట్లు కాదని.. పార్టీకి పునాదులు కార్యకర్తలేనని జోస్యం చెప్పారు.

No comments