1

Breaking News

జరిగిపోతున్న విభజన ప్రక్రియ కాంగ్రెస్‌ పార్టీకి ఒక ప్రాంతంనుంచి సీట్లు కానుకగా ఇవ్వగలదేమో గానీ..

‘విన్‌-లూజ్‌’ కాదిది... ‘విన్‌-చీట్‌’ సిట్యుయేషన్‌

ఏదైనా ఒక డీల్‌ జరుగుతున్నదంటే.. అది ఎలా ఉండాలి. ‘విన్‌`విన్‌’ సిచ్యుయేషన్‌లాగా ఉభయులు లాభపడేలా ఉండాలి. హ్యూమన్‌ రిలేషన్స్‌ మెయింటైన్‌ చేయడంలో.. ఈ విన్‌`విన్‌ అనేదే మొదటి సూత్రంగా అభివర్ణిస్తాడు.. ‘సెవెన్‌ హేబిట్స్‌ ఆఫ్‌ హైలీ ఎఫెక్టివ్‌ పీపుల్‌’ పుస్తకం రాసిన స్టీఫెన్‌ కవే. కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య డీల్‌ మాత్రమే కాదు.. పంపకాలు జరిగినా, రాష్ట్ర విభజన వంటి ప్రక్రియలు జరిగినా.. ఇరు ప్రాంతాల వారికి ‘విన్‌`విన్‌’ సిచ్యుయేషన్‌ తరహాలోనే వనరుల పంపకం ఏర్పాట్లు జరగాలి. అయితే ప్రస్తుతం మన రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరిస్తున్న పద్ధతి ఆ రీతిగా లేదని ఎవర్నడిగినా.. చెబుతారు. కాంగ్రెసు పార్టీకి కూడా రాజీనామా చేసేసి, తన ఎంపీ పదవిని వదిలించుకోవడానికి నానా పాట్లు పడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఇక పోటీచేసే ఉద్దేశం కూడా లేదంటూ ఒక స్థిర నిర్ణయానికి వచ్చేసిన నాయకుడు ఉండవిల్లి అరుణ్‌కుమార్‌ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.

అయితే ట్రాజెడీ ఏమిటంటే విభజన విషయంలో కేంద్రం అనుసరిస్తున్న ధోరణి.. ‘విన్‌`విన్‌’ కాదు కదా.. కనీసం ‘విన్‌`లూజ్‌’ సిచ్యుయేషన్‌ తరహాలో కూడా లేదు. సిచ్యుయేషన్స్‌ను డిఫైన్‌ చేసిన వారు కూడా ఊహించని రీతిలో ఇది ‘విన్‌`చీట్‌’ తరహాలో ఉన్నదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులతో సీట్లకోసం కుమ్మక్కు అయి.. దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ.. ఉమ్మడిగా సీమాంధ్రుల్ని చీట్‌ చేద్దాం..అనే పోకడ అనుసరిస్తున్నట్లుగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

తెలంగాణ వాదులు చెబుతున్న ప్రతి అంశానికి గంగిరెద్దులా తలూపుతూ.. సీమాంధ్రుల మొరలను నామమాత్రంగా కూడా ఆలకించకుండా.. జరిగిపోతున్న విభజన ప్రక్రియ కాంగ్రెస్‌ పార్టీకి ఒక ప్రాంతంనుంచి సీట్లు కానుకగా ఇవ్వగలదేమో గానీ.. సీమాంధ్రుల పాలిట అది మహావంచన అని.. పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Rallabhandy Ravindranath
 

No comments