ఏఎన్నార్ పురస్కారం
ఏఎన్నార్ పురస్కారం అందుకోవడం గర్వంగా ఉంది
Shyamభారతీయ సినిమాకి కేంద్ర స్థానం హైదరాబాద్. ఇది నా సొంతూరు. ఇక్కడ నా చిన్నప్పుడే సినిమాలు తీస్తానంటే బుద్ధి ఉందా? అన్నట్టు చూశారు. ఒకరిద్దరు తప్పితే ఆ ప్రస్థావనే తెచ్చినవారు లేరు. అలాంటిది ఈవేళ తెలుగు సినిమా ఎక్కడికో ఎదిగింది. అమెరికాలోనూ తెలుగు సినిమాని ఎగబడి చూస్తుండడం ఆనందాన్నిస్తోంది’’ అన్నారు ప్రఖ్యాత దర్శకనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే గ్రహీత శ్యాంబెనగల్. హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి చేతులమీదుగా అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం-2012 అందుకున్న సందర్భంగా శ్యాంబెనగల్ మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. మరెన్నో విశేషాలు ప్రస్థావిస్తూ-‘‘నేడు అత్యధిక సినిమాలు తీస్తోంది తెలుగులోనే.
నా చిన్నప్పుడు చంద్రశేఖర్, పైడిరాజ్ లాంటి ఇద్దరు ముగ్గురు మాత్రమే సినిమా గురించి మాట్లాడేవారు. ఇంకెవరూ సినిమా మాటే ఎత్తేవారు కాదు. అలాంటి దశలో చెనై్న నుంచి హైదరాబాద్‌కు సినిమాని తరలిండంలో అక్కినేని కృషి మర్చిపోలేనిది. ఆయనకు స్టూడియో అంటే చాలా ఇష్టం. దానికోసం ఎంతో శ్రమిస్తారు. అవన్నీ స్వయంగా నేను చూశాను. ఏఎన్నార్ కళామతల్లి ముద్దుబిడ్డ. ఆయన పేరుమీద ఉన్న ఈ అవార్డ్ అందుకోవడం గర్వంగా భావిస్తున్నా’’ అన్నారు. సమాజం కోసం సినిమాలు తీసిన గొప్ప దర్శకుడు శ్యామ్‌బెనగల్. హైదరాబాద్ నిజాం కాలేజీలోనే చదువుకున్నారాయన. నేనూ అదే కాలేజీలో చదివాను అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ అన్నారు. ఏఎన్నార్ మాట్లాడుతూ-‘‘75ఏళ్లుగా పరిశ్రమ నన్ను పెంచి పెద్ద చేసింది. నేను దాదాసాహెబ్ పాల్కే అవార్డును అందుకున్నపుడే ఈ అవార్డును ప్రతిభావంతులకు ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది.
No comments