sv ranga rao
చలన చిత్ర రంగంలో అద్భుతమైన నటనా కౌశలంతో ఎస్వీ రంగారావు మహానటుడిగా ఎదిగారని కేంద్ర మంత్రులు చిరంజీవి, పల్లంరాజు పేర్కొన్నారు. కాకినాడ ఐదు బిల్డింగుల సెంటరులో విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు స్మార క సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని శుక్రవారం రాత్రి కేంద్ర మా నవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎంఎం పళ్లంరాజు, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి కొణిదెల చిరంజీవి ఆవిష్కరించారు. చిరంజీవి మాట్లాడుతూ ఎస్వీఆర్ విగ్రహ ఏర్పాటుతో కాకినాడతో ఆయనకున్న అనుబంధానికి సార్థకత చేకూరిందన్నారు. 1963లో జకార్తాలో జరిగిన ప్రపంచ చలన చిత్రోత్సవాల్లో అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తి ఎస్వీఆర్ అన్నారు. విగ్రహం ఏర్పాటు చేసిన స్మారక సమితి సభ్యులను అభినందించారు. ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రులు వట్టి వసంతకుమార్, తోట నరసింహం, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వంగా గీత, పంతం గాంధీమోహన్, స్మారక సమితి అధ్యక్ష, కార్యదర్శులు జ్యోతుల శ్రీకృష్ణ, దంటు సూర్యారావు, బాదం మాధవరావు, కురసాల సత్యనారాయణ, బసవా ప్రభాకరరావు, ఉంగరాల వెంకటేశ్వరరావు, సుగుణకుమార్, యర్రా నాగబాబు పాల్గొన్నారు.
No comments