విద్యుత్ చార్జీల పెంపు
రాష్ట్రంలో తెలంగాణ సమస్య కంటే విద్యుత్ సమస్యను అధిగమించడమే కీలకంగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నట్టు తెలిసింది. శుక్రవారం కాకినాడ పర్యటనకు వచ్చిన ఆయన తిరుగు ప్రయాణంలో విశాఖ విమానాశ్రయంలో కొద్దిసేపు మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడినప్పుడు ఈ అంశం చర్చకు వచ్చిందని తెలిసిింది.
రాష్ట్రంలో విద్యుత్ సమస్య కారణంగా చిన్నాచితకా కుటుంబాలకు ఎటువంటి నష్టం లేదని, కేవలం పెద్ద పరిశ్రమలకే ఇబ్బందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలతో విద్యుత్ పరిశ్రమలు ఏర్పాటుచేస్తున్నా, ఇంకా ఉత్పత్తి ప్రారంభం కాకపోవడం వల్లనే ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చిందని వివరించారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలకు సంబంధించి మార్చి దాటే వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్టు సమాచారం. విద్యుత్ చార్జీల పెంపు విషయంలో ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోకముందే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, ఈ విషయంలో ప్రజలకు నిజం తెలియజేయాల్సి ఉందని సీఎం అన్నట్టు తెలిసింది.
గ్యాస్, బొగ్గు కొరత వల్ల విద్యుత్ సమస్య నెలకొందని, రిలయన్స్ నుంచి ర్రాష్టానికి రావాల్సిన వాటా దక్కినట్టయితే భవిష్యత్తులో విద్యుత్ సమస్యలు తలెత్తవని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కేంద్రంతో మాట్లాడామని, అవసరమైతే కోర్టుని ఆశ్రయించినా మనకు న్యాయం జరిగే అవకాశముందని సీఎం అన్నట్టు తెలిసింది.

No comments