కాంగ్రెస్ కేంద్ర కార్యవర్గంలో...
యువతకు నైపుణ్యం పెంపొందించేలా చర్యలు : పళ్లం రాజుకేంద్ర
మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పళ్లం రాజు మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థలో
ఎన్నో మార్పులు తీసుకుని వచ్చాం కాని పరిపాలనా పరమైన సంస్కరణలు
తీసుకురాలేకపోయామని యువ నాయకుల సలహాలు మెండుగా వచ్చా యన్నారు. ఎన్‌ఎస్‌యుఐ,
యూత్ కాంగ్రెస్ ఎంతో చురుకుగా పాల్గొన్నారని పేర్కొన్నారు. దేశంలో
ప్రధాన ఆదాయ వనరుగా వున్న వ్యవసాయం రైతుకు లాభం చేకూర్చేందుకు ఎలాంటి
చర్యలు చేపట్టాలని కోరారని చెప్పారు. దేశంలోని 50 కోట్ల మంది యువతకు
మెరుగైన జీవనోపాధి కల్పించేందుకు నైపుణ్యతను పెంచేందుకు తీసుకోవలసిన
చర్యలపై అనేక సలహాలు యువ నేతల నుంచి వచ్చాయని పళ్లం రాజు చెప్పుకొచ్చారు. ఈ
సలహాలను కాంగ్రెస్ కేంద్ర కార్యవర్గంలో చర్చిస్తారని వెల్లడించారు.
సంక్షేమ పథకాలపై సుదీర్ఘ చర్చ : పురంధేశ్వరిప్రజలకు ఇప్పటి వరకు అందించిన సంక్షేమ పథకాలు ఎంత మేరకు అందుబాటులోకి వెళ్లాయనే అంశం మీద సుధీర్ఘ చర్చ జరిగింది. ఇంతకంటే మెరుగైన సేవ ఎలా అందించాలనే విసయంలోనూ అనేక సలహాలు మా చర్చలలో వచ్చాయన్నారు. 2014 లో ప్రధాని అభ్యర్థి ఎవరనే అంశాన్ని కూడా ఈ చర్చలలో ప్రధానాంశంగా వుండబోతున్నదని భావించవచ్చు. రాహుల్ గాంధీ ఇప్పటికే పార్టీలో కీలక బాధ్యతలు, నిర్వహిస్తున్నారు. ప్రధాని అభ్యర్థి ఎవరని పార్టీ అధ్యక్షురాలు నిర్ణయిస్తారు. యువజన కాంగ్రెస్ ను ఆయన బలోపేతం చేశారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని రాజకీయాలలోకి వస్తున్నారన్నారు. ఇక రాష్ట్ర పరిస్థితి వరకు వస్తే రాష్ట్రం సమైక్యంగా వుండాలనేదే నా అభిప్రాయం. దాన్నే నేను మా పార్టీ పెద్దలకు వెల్లడించాం. అయినప్పటికీ పార్టీ అధిష్టానం చేసిన నిర్ణయానికి కట్టుబడి వుంటాం. మహిళా సాధికారత, రిజర్వేషన్లు లాంటి మహిళకు చెందిన ఎన్నో ముఖ్యమౌన అంశాలు చర్చించాం. ఈ మేధోమథనంలో ఆత్మ విమర్శలు చేసుకునే అవకాశం లభించింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కేవలం కాంగ్రెస్ ఒక్కటే నిర్ణయం తీసుకుంటే సరిపోదు కదా. మిగతా పార్టీలు కూడా దీనికి సహకరించాలని అభ్యర్థిస్తున్నాం.
పార్టీ బలోపేతానికి సదస్సు దోహదం : కిల్లికృపారాణిసోనియాగాంధీ నేతృత్వంలో పార్టీ సమర్ధవంతంగా ముందుకు పోతోంది. దీనిని మరింత బలోపేతం చేసేందుకు ఇలాంటి సదస్సులు ఉపయోగపడ తాయి. ఈ సదస్సులో చర్చించిన అంశాలు రాష్ట్రం, కేంద్రలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసాన్ని కల్పించింది. ప్రధాన సమస్యలుగా భావిస్తున్న తెలంగాణపై ఈ సదస్సులో చర్చ జరగలేదని స్పష్టం చేశారు. జగన్ ను ఏనాడు మేము సమస్యగా భావించలేదు. కొంతమంది పార్టీలో ఎదిగి పార్టీకి సమాంతరంగా సవాళ్లు విసిరే సరిస్థితి కొత్త విషయం కానే కాదు.ప్రాంతీయ పార్టీలు పరిమిత మయిన లక్ష్యంతోనూ, స్వార్ధపూరిత ఆలోచనతోనూ పనిచేస్తాయి. వీటికి జాతీయ దృక్పదం వుండదు. నేను వ్యక్తిగతంగా సమైక్య వాదిని, కాని తెలంగాణ కాని మరేదయినా కాని సోనియా గాంధీ ఏనిర్ణయం తీసుకున్నా దాని వెనుకాల దేశ ప్రయోజనాలు వుంటాయని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం గురించి కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటే సీమాంధ్రకు చెందిన నాయకులు రాజీనామా చేస్తారన్నది వాస్తవమే. అది వారి స్వంత విషయం. కాకపోతే రాజీనామాలు అనేవి సమస్యకు పరిష్కార మార్గం చూపుతాయని నేను భావించడం లేదు. వీటిపై విస్తృతమైన చర్చ కూడా జరుగుతుంది. మహిళల సంక్షేమం కోసం కేంద్రం కేటాయించిన నిధులు వారికే ఖర్చు చేయాలనేది నా ప్రధానంగా నేడు వినిపించాను. అత్యాచారానికి గురికాబడిన బాధితురాలను పోలీసులు తమ పరిధిలో లేదంటూ తిప్పడంపై నేను గట్టిగా తన వాణిని వినిపించాను.
2014 ఎన్నికల వ్యూహాలపై మేధోమథనం : బొత్స సత్యనారాయణఈ సదస్సులో 2014 ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై మేధో మథనం జరుగుతుంది. నేను ఆజాద్ అధ్యక్షతన నిర్వహించిన కమిటీలో సభ్యు డిని. అదే విధంగా అనేక రాష్ట్రాలకు చెందిన పిసిసి అధ్యక్షలు పాల్గొన్నారు. పార్టీ, ప్రభుత్వ సమన్వయంపై ప్రధానంగా మా టీం లో చర్చ జరిగినట్లు బొత్స వెల్లడించారు. మా నుంచి సేకరించిన సలహాలను నోట్ రూపంలో మేడం కు అందుతుంది. మండల స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు అవలంభించాల్సిన ప్రణాళిక గురించి ఎంతో చర్చించాం. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలను కోవడంలో ఏ మాత్రం తప్పులేదు. కాంగ్రెస్ పార్టీ తోనే దేశం సుభిక్షంగా వుంటుందని భావిస్తున్నాం. ఈ సదస్సులో దేశంలోని అన్ని రాష్ట్రాలలోని అన్ని సమస్యలు చర్చించాం. మన రాష్ట్రంలోనివే సమస్యలు కావు. రాష్ట్రంలో జగన్‌తో పొత్తు విషయం లో వాయిలార్ రవి ఆయన అభిప్రాయం వెల్లడించారు. దానిపై మేం ఆలోచిస్తాం. రాజకీయాలలో పొత్తు అనేది కాంగ్రెస్ పార్టీ విధానాలు విశ్వసించి వచ్చిన వారితోనే వుంటుంది.
తెలంగాణ అంశంపై కోర్ కమిటీ నిర్ణయం : వి. హనుమంతరావుచిన్న రాష్ట్రాల డిమాండ్ వేరే ప్రాంతాలలో కూడా వుండవచ్చు కాని ఇది 5 దశాబ్ధాలుగా వున్న ప్రజల ఆకాంక్ష అని నేను ఏకె. ఆంటోనికి స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ అంశంపై కోర్ కమిటీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. దీనిపై చిక్కుముళ్లు వేయవద్దని కోరా. బడుగు బలహీన వర్గాల ప్రజలు మన దేశంలో అధికంగా వున్నారు. వారికి మేలు కలిగేలా నిర్ణయం తీసుకోవాలని కోరా. సీమాంధ్ర ప్రాంతంలో తెలంగాణను వ్యతిరేకించే వాళ్లు చాలా తక్కువని ఆంటొనికి చెప్పా. ఆయన దానిని పరిగణలోకి తీసుకున్నారు.

No comments