రికార్డు స్ధాయిలో ఉష్ణోగ్రతలు
బీజింగ్ : చైనాలో రికార్డు స్ధాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గత 28 ఎళ్లలో
ఎన్నడూ లేనంత స్థాయిలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా నమోదవ్వడంతో చైనా వ్యాప్తంగా
చలిగాలుల తీవ్రత పెరిగింది. నవంబర్ నెలలో అత్యల్ప స్థాయిలో ఉష్ణోగ్రతలు
పడిపోయి గడచిన మూడు దశాబ్దాల్లోనే అత్యంత శీతల మాసంగా రికార్డు
నమోదయ్యింది. ఇక చలి తీవ్రత విషయానికి వస్తే శనివారం చైనా మెటీరియాలాజికల్
విభాగం తెలిపిన వివరాల ప్రకారం తూర్పు సముద్ర తీరం మంచుతో గడ్డ కట్టుకు
పోవడంతో దాదాపు 1000 షిప్‌లు సముద్రంలో ఇరుక్కుపోయాయి. లయాజో తీరం నుంచి
షాండంగ్ ప్రావిన్స్ వరకు గల సముద్రం ఘనీభవించిందని వాతావరణ విభాగం
తెలిపింది.
కాగా లయాజో తీరంలో ప్రతి వారం 291చదరపు కి.మీ చొప్పున సముద్రం గడ్డకడుతోందని వాతావరణ విభాగం పేర్కొంది. ఇదిలా ఉంటే చైనా వ్యాప్తంగా గత నవంబర్‌లో గడచిన 10రోజుల ఉష్ణోగ్రతల సగటును మైనస్ 3.8 సెల్సియస్‌గా నమోదయ్యింది. ఈశాన్య చైనాలో గత 43 ఏళ్ల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు మైనస్ 15.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఇక బీజింగ్ విషయానికి వస్తే గత 2 వారాలుగా 0డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలే నమోదవ్వడంతో జనజీవనం చలిగాలులతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గుట్టగుట్టలుగా మంచు పేరుకు పోతుండడంతో రవాణా సదుపాయాలకు విఘాతం ఏర్పడుతోంది

No comments