550 మంది భారతీయులు మృతి చెందారు.
దుబాయ్ : గడచిన 2012 సంవత్సరంలో గల్ఫ్ దేశం ఒమన్‌లో ఆత్మహత్యలకు పాల్పడ్డ
భారతీయుల సంఖ్య 60 వరకు ఉంటుందని ఒమన్ భారత రాయబార కార్యాలయ వర్గాలు
తెలిపాయి. 2011 సంవత్సరంలో ఈ సంఖ్య 54గా తేలిందని ఏటికి ఏడు ఆత్మహత్య
చేసుకునే భారతీయుల సంఖ్య పెరుగుతూ వస్తోందని రాయబార కార్యాలయం ఆందోళన
వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే గత సంవత్సరం ఒమన్‌లో జరిగిన వివిధ దుర్ఘటనల్లో
550 మంది భారతీయులు మృతి చెందారు. వీరిలో ఎక్కువ శాతం మంది రోడ్డు
ప్రమాదాలు, హత్యలు, ఇతర ప్రమాదాల్లో మృతి చెందారు. గత సంవత్సరం ఆగస్టులో ఈ
విషయమై రాజ్యసభలో చర్చకు వచ్చింది. ప్రభుత్వం సమగ్రమైన చర్యలు చేపట్టాలని
పలువురు చర్చ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఒమన్‌లోని ఒక సంస్థ
గల్ఫ్‌లో కష్టాల పాలైన భారతీయులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. తమను
సంప్రదిస్తే సమస్యలకు పరిష్కారం చూపుతామని సంస్థ తెలియజేసింది.
No comments