1

Breaking News

భక్తులతో శబరిమల

భక్తులతో నిండిపోయిన శబరిమల
మకరజ్యోతి దర్శనారాతం వచ్చే భక్తులతో శబరిమల రద్దీగా నిండిపోయింది. రేపు దివ్యఘట్టాన్ని చూసేందుకు లక్షల మంది భక్తులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మకరజ్యోతి వెనుక మానవ ప్రయత్నం ఉందని వెల్లడైన తర్వాత కూడా అయ్యప్పస్వాముల విశ్వాసం సడలిపోలేదు. పుణ్యమూర్తి సన్నిధిలో మహనీయ సన్నివేశాన్ని తిలకించడానికి సమయాత్తమవుతున్నారు. ఏడాది కిందట శబరిమల మకరజ్యోతిపై చెలరేగిన చర్చ అంతా ఇంతాకాదు. అది దైవసంబంధమా లేక మానవ ప్రయత్నమా తేల్చాలంటూ చాలా సంఘాలు కేరళ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. హైకోర్టు ఆదేశం ప్రకారం ట్రావన్‌ కోర్‌ దేవస్థానం అది మానవ ప్రయత్నమని నివేదిక ఇచ్చింది. దాంతో కొన్ని దశాబ్దాలుగా మకరజ్యోతి వెనకఉన్న చిక్కుముడులు వీడిపోయాయి.

No comments