మోడీపై ప్రశంసల వర్షం
 టాటా గ్రూపు కొత్త చైర్మన్ సైరస్‌మిస్ర్తీ గుజరాత్ 
ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రశంసలతో ముంచెత్తారు.  
గుజరాత్‌ను వ్యాపారానికి అనువుగా మలిచారని మోడీని ప్రశంసించారు. టాటాగ్రూపు
 పగ్గాలు చేపట్టిన తర్వాత మిస్ర్తీ మొట్టమొదటిసారి ప్రజలను ఉద్దేశించి 
ప్రసంగించారు. మిస్ర్తీ వైబ్రెంట్ గుజరాత్ ఆరవ వార్షికోత్సవం ముగింపు 
సందర్భంగా పాల్గొని ప్రసంగించారు. గుజరాత్ ప్రభుత్వం ఇక్కడ వ్యాపారం 
చేసేందుకు వచ్చే వారికి అన్నీ రకాల మౌలికసదుపాయాలు అందుబాటులో ఉంచిదని 
మిస్ర్తీ అన్నారు.  గుజరాత్‌నుపారిశ్రామికంగా అభివృద్ధి  పథంలో తెచ్చేందుకు
 మోడీ కంకణం కట్టుకున్నారని మిస్ర్తీ మోడీపై ప్రశంసల వర్షం 
కురిపించినప్పుడు మహాత్మాగాంధీ హాలులో ప్రజల చప్పట్లతో మారుమోగిపోయింది.
 
 

No comments