1

Breaking News

'నాయక్' చిత్రం వివాదం

 కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ, దర్శకుడు వి.వి. వినాయక్ దర్శకత్వంలో నటించిన 'నాయక్' చిత్రం వివాదం ముదురుతోంది. ఈ చిత్రంలో తన పేరు విలన్ పాత్రకు ఉండడంతో అ«భ్యంతరం వ్యక్తం చేస్తూ మాజీ శాసననభ్యుడు గండి బాజ్జీ పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా మంగళవారం బాజ్జీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఈ చిత్రంలో విలన్ పాత్రకు తన పెరు పెట్టడంతో అభ్యంతరం వ్యక్తం చేస్తూ చిత్రం రిలీజ్ అయిన మరుసటి రోజున ఆ చిత్ర దర్శకుడు వి.వి. వినాయక్‌తో ఫోన్‌లో మాట్లాడానని, దీనిపై స్పందించిన ఆయన పేరు తొలగిస్తానని చెప్పారన్నారు. అయితే ఇంటి పేరు మాత్రమే తొలగించి బాజ్జీ అని ఉంచారని, దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఐదుగురిపై పీఎస్‌లో పిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఈ చిత్రంలో విలన్ అన్యాయం, అక్రమాలు, భూకబ్జాలు చేయడం సినియే కావచ్చు, కానీ తన పేరు పేరుతో ఉండడం చాలా అవమానంగా ఉందని, తన సన్నిహితులు కూడా ఇదే విషయం తనవద్ద ప్రస్తావించారని బాజ్జీ తెలిపారు. చిత్రం రిలీస్ అయి వారు రోజులు గడుస్తున్నా తన పేరు తొలగించకపోవడంతో కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.

No comments