1

Breaking News

సౌరశక్తితోనే ఉపశమనం

సౌరశక్తితోనే ఉపశమనం
 మునిసిపాలిటీలకు విద్యుత్‌ బిల్లులు తడిసి మోపడవుతున్నాయి. ప్రజలు చెల్లిస్తున్న పన్నులు విద్యుత్‌ బిల్లులకే సరిపోతోంది. మునిసిపాలిటీలలో వినియోగిస్తున్న విద్యుత్‌ బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో రాష్ట్రంలోని అత్యధిక మునిసిపాలిటీల పరిస్థితి. విద్యుత్‌ చార్జీల నుంచి మునిసిపాలిటీలను బయటపడేందుకు ఉన్నతాధికారులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. వీధిదీపాలు, నీటి సరఫరా ప్రాజెక్టుల కోసం వినియోగిస్తున్న విద్యుత్‌ మహానగర పాలక సంస్థలతో పాటు మునిసిపాలిటీలకు పెను భారంగా మారాయి.

ఏటా కోట్ల రూపాయలు కేవలం విద్యుత్‌ బిల్లులకు చెల్లిస్తున్న మునిసిపాలిటీలు ప్రత్యామ్నాయంపై భారీగా కసరతు ప్రారంభించాయి. విద్యుత్‌భారం నుంచి విముక్తి పొందేందుకు ఏకైన మార్గం ‘సోలార్‌ ప్లాంట్ల ’ఏర్పాటే శరణ్యమని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ అధికారులు భావిస్తున్నారు. ఏటా కోట్లు...లక్షల్లో వస్తున్న బిల్లునుంచి మునిసిపాలిటీలను గట్టెక్కించేందుకు ప్రత్యామ్నాయం సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లేనని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, తిరుపతి, వరంగల్‌, నిజామాబాద్‌, రాజమండ్రి, ఏలూరు తదితర కార్పొరేషన్లతో పాటు రాష్ట్రంలోని మరో 20 గ్రేడ్‌-1 మునిసిపాలిటీలలో ‘సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు’ ఏర్పాటు కోసం కసరతు ప్రారంభించారు.

ఒక మెగావాట్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు ఒకేసారి రూ.7-8కోట్లు వెచ్చిస్తే ఇక విద్యుత్‌ కోతలతో పాటు, విద్యుత్‌ భారం నుంచి మునిసిపాలిటీలను గట్టెక్కించగలమన్న అధికారుల ఆలోచనకు ముఖ్యమంత్రి కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ముందుగా తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఒక కార్పొరేషన్‌లో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుపై ఆయా మునిసిపాలిటీల కమీషనర్లు ప్రతిపాదనలు కూడా రెడీ చేస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం కార్పొరేషన్‌లో ఏటా రూ.6కోట్ల మేర విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నారు. దీన్ని ఆదాచేసేందుకు సోలార్‌ విద్యుత్‌ప్లాంట్‌ ఏర్పాటుకోసం సన్నాహాలు ప్రారంభించారు.

విద్యుత్‌ కోతలు, బిల్లుల నుంచి ఉపశమనం పొందేందుకు మునిసిపాలిటీలో ఏర్పాటు చేసే సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఉత్పత్తి అయ్యేదాంట్లో మునిసిపాలిటీ అవసరాలకు వాడుకొని మిగతాది ట్రాన్స్‌కోకు విక్రయించాలని నిర్ణయించారు. దీనిపై అధికారులు అధ్యయనం పూర్తిచేశారు. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ, రాజమండ్రి మునిసిపాలిటీలలో ఏటా 5 నుంచి 15 మెగా వాట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. అదే అనంతపురంలో మాత్రం 3.5మెగా వాట్ల విద్యుత్‌ను మునిసిపాలిటీ వినియోగిస్తున్నది.

గ్రిడ్‌కు అనుసంధానం....
సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ట్రాన్స్‌కో గ్రిడ్‌కు పంపింపి అక్కడి నుంచి మునిసిపాలిటీకి అవసరమయ్యే విద్యుత్‌ను వినియోగించాలని నిర్ణయించారు. ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ్రగ్రిడ్‌కు పంపించి అక్కడి నుంచి అవసరం మేరకు వినియోగించుకోవడం, మిగిలిన విద్యుత్‌ను ట్రాన్స్‌కోకు విక్రయించడం ద్వారా మునిసిపాలిటీకి ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టును పండమేరు వాటర్‌వర్క్‌‌స, సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌లోనూ ప్లోటింగ్‌ సోలార్‌ ప్లేట్స్‌ ద్వారా విద్యుత్‌ ఉత్ప్తి చేసే ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేశారు. దీనిపై స్వీడన్‌కు చెందిన కొన్ని కంపెనీలతో అధికారులు పలు దఫాలుగా సమీక్షించారు. ఈ నెలాఖరులోకానీ, ఫిబ్రవరి మొదటి వారంలోకానీ స్వీడన్‌కు చెందిన కంపెనీ ప్రతినిధులు క్షేత్ర స్థాయి పరిశీలనకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు.

నిధులపై మల్లగుల్లాలు
విద్యుత్‌ ఆదా, కొత్తగా సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు నాబార్డ్‌ రుణాలు మంజూరు చేయనుంది. అయితే నాబార్డ్‌ ద్వారా రుణాలు తీసుకోవాలా? లేక ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ) పద్థతిలో ఏర్పాటు చేయాలా అన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. సొంతంగా ప్లాంట్‌ను ఏర్పా టు చేస్తే అవసరం మేరకు విద్యుత్‌ వాడుకోని మిగతాది విక్రయిస్తే కార్పొ రేషన్‌కు ఆదాయం సమకూరనుందన్న విషయంపై కూడా ఆలోచి స్తున్నారు. ప్రాజెక్టుకు వెచ్చించిన మొత్తం ఒకటిన్నర, లేక రెండేళ్లలో తీరిపోనుందన్న విషయంపై కసరతు చేస్తున్నారు.

ఏదీ ఏమైనా ప్రస్తుతం రాష్ట్రంలో పెరిగి పోతు న్న విద్యుత్‌ ఛార్జీల భారం నుంచి మునిసిపాలిటీలను రక్షించేందుకు స్వంతం గా ‘సోలార్‌ ప్లాంట్లు’ ఏర్పాటు ఒక్కటే శరణ్యమని అధికారులు భావిస్తు న్నారు. ఈ తరహా ప్లాంట్లు ఏర్పాటు చేస్తే విద్యుత్‌కోతల నుంచి విముక్తితో పాటు తాగు నీటి పథకానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాబోవని అధికా రులు భావి స్తున్నారు. రాష్ట్రంలో తక్కువలో తక్కువగా పది మునిసిపాలిటీలలో స్వంతంగా సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

No comments