ఇందిరాపార్కునుంచి గన్‌పార్కు వరకు
తెలంగాణ అంశంపై డెడ్‌లైన్ లేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల
ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్ ప్రకటించడంపై ఓయూ జేఏసీ నిప్పులు చెరిగింది.
ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ అంశంపై ఇంకా సంప్రదింపులు
జరపాల్సి ఉంది అనడాన్ని విద్యార్థులు విమర్శించారు. దీన్ని నిరసిస్తూ రేపు
ఇందిరాపార్కునుంచి గన్‌పార్కు వరకు విద్యార్థి మహాప్రదర్శన నిర్వహించాలని
ఓయూ జేఏసీ నిర్ణయించింది. ఈ ప్రదర్శనకు పోలీసులు అనుమతిచ్చినా,
ఇవ్వకపోయినా ర్యాలీ నిర్వహించి తీరుతామని వారు హెచ్చరించారు.
No comments