1

Breaking News

రియాల్టీ షో కోసం వేసిన సెట్‌లో అగ్ని ప్రమాదం

అన్నపూర్ణ స్టూడియోలోని ఏడెకరాల్లో ఓ రియాల్టీ షో కోసం వేసిన సెట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 5లోని స్టూడియోలో రియాల్టీ షో కోసం భారీ సెట్ వేశారు. సోమవారం ఉదయం పదిగంటల ప్రాంతంలో సెట్‌లో నుంచి పొగలు వ్యాపించడం చూసిన వాచ్‌మ్యాన్ వెంటనే విషయాన్ని పోలీసులకు, అగ్నిమాపక శకటాలకు సమాచారం అందించాడు.

ఇంతలోనే భారీ యెత్తున మంటలు వ్యాపించడం సెట్ పూర్తిగా అగ్నికి ఆహుతయింది. రెండు అగ్ని మాపక శకటాలు స్టూడియోకు చేరుకొని మంటలను అ దుపు చేశాయి. ఈ సంఘటనల పదిహేను లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని స్టూడియో మేనేజర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

No comments