తీవ్ర నిరసన
తెలంగాణపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్చి ఆజాద్ ప్రకటనతో
ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది. ఆజాద్ వ్యాఖ్యల పట్ల తెలంగాణ
వాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు,. సమరదీక్ష వేదిక వద్దకు వేలాదిగా
జనం నలుమూలలనుంచి తరలివచ్చారు. రేపు ఉదయం వరకు జనం భారీగా తరలివచ్చే
అవకాశం ఉంది. సమర దీక్ష వద్దకు రేపు ఉదయానికి జనం భారీగా తరలివెళతామని ఓయూ
విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే
తీవ్ర పరిణామాలుంటాయని వారు హెచ్చరించారు. సమరదీక్షకు రెండు వేల మందికి
మాత్రమే అనుమతిచ్చారు. అయినప్పటికీ అధిక సంఖ్యలో జనం తరలిరావడంతో పోలీసులు
అదుపుచేయలేని పరిస్థితి ఏర్పతుంది.
No comments