తెలంగాణ అనుకూల 'సిగ్నల్స్' ఇంకొంచెం బలపడ్డాయి.
రాష్ట్ర విభజన జరగదు, జరగబోదు' అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పే
మంత్రి టీజీ వెంకటేశ్... 'తెలంగాణ ఇచ్చే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి'
అన్నారు. ఎప్పుడూ నవ్వుతూ, వ్యంగ్యాస్త్రాలు సంధించే ఆయన... నిరాశగా,
నీరసంగా కనిపించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల వాదనను తిప్పికొట్టలేకపోయామని,
ఆ శక్తి తమకు లేకపోయిందని వాపోయారు! ఇక... టీ-కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ
రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా సంకేతాలున్నాయని ప్రకటించారు. విభజన విషయం
ఆఖరు అంకానికి చేరిందంటున్నారు. తెలంగాణ ప్రాంత సీనియర్ నేత, మంత్రి
జానారెడ్డి సమస్య పరిష్కారమైనట్లేనంటూ అధిష్ఠానానికి ధన్యవాదాలు చెప్పేలా
ప్రకటనలు మొదలుపెట్టారు. దీంతో రాష్ట్రంలో విభజన రాజకీయం మరింత
వేడెక్కింది.
తెలంగాణ అనుకూల 'సిగ్నల్స్' ఇంకొంచెం బలపడ్డాయి. పూర్తిస్థాయి సందిగ్ధం స్థానంలో... కొన్ని సందేహాలతో కూడిన స్పష్టత ఏర్పడటం మొదలైంది. అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంత నేతల మధ్య మాటల హోరాహోరీతోపాటు... హితవులు, సూచనలు, బుజ్జగింపులూ నడుస్తున్నాయి. విభజనపై కేంద్రం సానుకూల నిర్ణయానికి వచ్చేసిందని... దేశవ్యాప్తంగా తలెత్తనున్న చిన్న రాష్ట్రాల డిమాండ్ల సమస్యను ఎలా పరిష్కరిస్తారు? హైదరాబాద్‌ను ఏం చేస్తారు? అనే అంశాలే ఇప్పుడు ప్రధానంగా మారాయని నేతలు చెబుతున్నారు.
కాంగ్రెస్ పెద్దలు ఈ అంశాలపైనే తర్జన భర్జనలు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విభజన దిశగా అడుగులు పడుతున్నాయన్న అభిప్రాయం బలపడిన నేపథ్యంలో... అటు హైదరాబాద్ నగర మంత్రులు, ఇటు రాయలసీమ నేతలు స్వరం పెంచడం గమనార్హం. హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రం చేయాలంటూ మంత్రులు దానం నాగేందర్, ముఖేశ్ గౌడ్ డిమాండ్ చేయగా... సీమ నీటి కష్టాల గురించి ఏరాసు ప్రతాపరెడ్డి ఏకరువు పెట్టారు. 'మాకు అన్యాయం జరిగితే ఊరుకోం' అనే సంకేతాలు పంపారు.
ఇక... రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హఠాత్తుగా 'జై ఆంధ్ర' ఉద్యమాన్ని గుర్తు చేయడం కలకలం సృష్టించింది. మొత్తమ్మీద... 'కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది' అనే ప్రాతిపదికనే అన్ని ప్రాంతాల వారి ప్రకటనలు, స్పందనలు ఉండటం గమనార్హం. ఈ పరిస్థితుల మధ్య... గురువారం ఉదయం 11 గంటలకు మంత్రుల నివాస ప్రాంగణంలోని క్లబ్‌లో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల 'సమైక్య' సమావేశం జరగనుంది.
ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసి వస్తున్న టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాపరెడ్డి, కాసు, పినిపె విశ్వరూప్‌లు... తమ భేటీల సారాంశాన్ని ఇతర నేతలకు వివరించనున్నారు. ఈ సదస్సును అడ్డుకుంటామని తెలంగాణ జాగృతి కవిత పేర్కొనగా... ఈ సమావేశాన్ని వ్యతిరేకిస్తామంటూనే, దీనిని సీమాంధ్ర నేతల విజ్ఞతకే వదిలేస్తామని టీ-జేఏసీ స్పష్టం చేసింది.
మరిన్ని సంప్రదింపులు: రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కిన సమయంలోనే... జైపూర్‌లో జరగనున్న మేధో మథనంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గురువారం ఢిల్లీకి వెళ్తున్నారు. మేధోమథనం జరిగేంత వరకూ రాష్ట్ర రాజకీయాలపై వీరిద్దరితో అధిష్ఠానం మాట్లాడే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 21 నుంచి వరుసగా ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడితో రాష్ట్ర పరిస్థితులపై సంప్రదింపులు జరిపే అవకాశముందంటున్నారు. ఆ తర్వాతే అధిష్ఠానం తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని చెబుతున్నారు.
కారణమేమి సుమా?: తెలంగాణకు సానుకూలంగా అధిష్ఠానం నుంచి సంకేతాలు రావడానికి కారణమేమై ఉంటుందనే చర్చ కాంగ్రెస్‌లో జోరుగా సాగుతోంది. బుధవారం సీఎల్పీ కార్యాలయంలో మంత్రి మాణిక్య వరప్రసాద్, మాజీ మంత్రులు గాదె వెంకటరెడ్డి, ఆదాల ప్రభాకర రెడ్డి, ఎమ్మెల్యే వీరశివారెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్ ఆమోస్‌ల మధ్య ఇదే అంశంపై చర్చ జరిగింది. తెలంగాణ వస్తోందన్న ప్రచారం వారం రోజులుగా జరుగుతోందని, దీనికి కారణం ఏమిటో తెలియడం లేదని పేర్కొన్నారు.
తెలంగాణపై ఏదో ఒకటి త్వరగా తేల్చాలని ఇంతకాలంగా చెబుతూ వస్తోన్న నేతలు ఇప్పుడు... తమ ప్రాంత ఆకాంక్షలు మాత్రమే నెరవేరాలంటూ పట్టుబడుతుండటం విశేషం. మరోవైపు... రాజ్యసభ మాజీ సభ్యుడు కె.కేశవరావు నివాసానికి జేఏసీ చైర్మన్ కోదండరాం వెళ్లారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశం సమయంలోనే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కుందూరు జానారెడ్డి కూడా కేకే నివాసానికి వచ్చారు.
తాము హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను కోరుకుంటున్నామని .. మరో ప్రత్యామ్నాయం లేదని కోదండరాం స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల సమావేశాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కాగా.. కేకే, జానారెడ్డిలు ఎంపీ మంద జగన్నాథం నివాసానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. తర్వాత జానారెడ్డి చాంబర్‌లో తెలంగాణ ప్రాంత మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, ప్రసాదరావులు సమావేశమయ్యారు.
"హైదరాబాద్ కూడా భారతదేశంలోనే ఉంది. ఇక్కడ సమావేశం నిర్వహించుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది''
- మంత్రి శైలజానాథ్
"సమైక్యాంధ్ర సభను వేర్పాటు వాదులు అడ్డుకుంటే యుద్ధం తప్పదు''
- సమైక్యాంధ్ర బలహీన వర్గాల జేఏసీ
"సమైక్యాంధ్ర సదస్సును అడ్డుకుంటాం. తర్వాతి పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత''
- తెలంగాణ జాగృతి కవిత
"హైదరాబాద్‌లో సీమాంధ్ర సదస్సు తెలంగాణవాదులను రెచ్చగొట్టడమే. కావాలంటే జైపూర్‌లో పెట్టుకోండి''
- బీజేపీ నేత విద్యాసాగర్‌రావు
"సమైక్యవాదుల ప్రయత్నాలు దౌర్జన్యకరం. తెలంగాణను ఆపడం ఎవరితరం కాదు. శాంతియుత విభజనకు సీమాంధ్ర ప్రజలు సహకరించాలి''
- టీ జేఏసీ నేత కోదండరాం
" సహకరిస్తే సహనంతో ఉంటాం. లేకపోతే యుద్ధమే. ప్యాకేజీలు, ప్యాకెట్లు ఆంధ్రావాళ్లకే ఇవ్వండి. తిని నోర్మూసుకుంటారు. మాకు కావాల్సింది హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం.''
- ఎంపీ మధుయాష్కీ
"హైదరాబాద్‌లో సీమాంద్రులను అన్నదమ్ముల్లా చూసుకుంటాం. లేనిపోని అపోహలు సృష్టించవద్దు. సీమాంధ్ర కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తాం''
- గుత్తా సుఖేందర్‌రెడ్డి
"తుపాకీ పేల్చడం తెలంగాణవారికి అలవాటే. జాగ్రత్తగా ఉండండి. మతతత్వం, ఉగ్రవాదం, తీవ్రవాదం అని భయపెట్టేలా మాట్లాడొద్దు''
- ఎంపీ పొన్నం
"వాళ్లు తరిమి కొడుతుంటే చూస్తూ ఉండడానికి మేం గాజులు తొడుక్కుని లేం. మా తడాఖా చూపిస్తాం. ఏ త్యాగానికైనా మేం సిద్ధం''
- ఎంపీ రాయపాటి
"ప్రజల ఉద్యమం లేకపోతే రాజీనామాలెందుకు? తెలంగాణపై ఏకాభిప్రాయం కుదిరే అవకాశం తక్కువే. దీనిపై అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుంది''
- మంత్రి డీఎల్
"ఉంటే.. రాష్ట్రం సమైక్యంగా ఉండాలి. లేదా.. గిరిజన ప్రాంతాలను కలిపి ప్రత్యేక మన్యసీమ ఏర్పాటు చేయాలి''
- సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర
"తెలంగాణ తేలేలోపు రాయలసీమ అంశాన్నీ తేల్చాలి. లేకపోతే ఉద్యమం తప్పదు. ఇస్తే మూడు రాష్ట్రాలు ఇవ్వాలి''
- సీమ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి
"విభజనకే నిర్ణయిస్తే.. అధిష్ఠానాన్ని ధిక్కరించడానికి సిద్ధం. హడావిడి నిర్ణయాలు తీసుకోవద్దు''
- కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి
"హైదరాబాద్‌ను బూచిగా చూపిస్తూ అడ్డుపడితే అంతర్యుద్ధం తప్పదు.''
- గద్దర్, ఉద్యమ నేతలు

No comments