పారిశ్రామికోత్పత్తిలో క్షీణత
భారతదేశానికి గడ్డు పరిస్థితి తొలగినట్టేనని, ముందున్నవి మంచి రోజులేనని
బ్యాంక్ ఆఫ్ అమెరికా, మెరిల్ లించ్ (బోఫా-ఎంఎల్) తేల్చి చెప్పింది. ఇటీవల
వెలువడిన పారిశ్రామికోత్పత్తి, వాణిజ్య లోటు గణాంకాల ఆధారంగా బోఫా ఎంఎల్
తాజా అంచనాలు ప్రకటించింది. దేశంలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం కూడా
డిసెంబర్‌లో 7.2 శాతానికి దిగే అవకాశం ఉన్నందువల్ల ఆర్‌బిఐ ఈ నెల 29న
విడుదల చేసే విధాన సమీక్షలో కీలక రేట్లు తగ్గించవచ్చునని అంచనా వేసింది.
నవంబర్‌లో ఐఐపిలో క్షీణత -1.5 శాతం మేరకు ఉంటుందన్న తమ అంచనాకు భిన్నంగా
-0.1 శాతం క్షీణత మాత్రమే చోటు చేసుకున్నదని, ప్రధానంగా దీపావళి
సీజన్‌లోను, ఆ తర్వాత ఏర్పడిన డిమాండును తట్టుకునేందుకు వినియోగ వస్తువుల
విభాగంలో ఉత్పత్తి పెరిగి స్థూలంగా పారిశ్రామికోత్పత్తిలో కూడా క్షీణత
తగ్గడానికి దోహదపడిందని ఆ నివేదికలో పేర్కొన్నారు.
పారిశ్రామికోత్పత్తిలో క్షీణత మరి కొంత కాలం ఉండవచ్చునని, 2013 ప్రథమార్ధంలో వడ్డీ రేట్ల తగ్గుదల ప్రారంభమైన తర్వాత మాత్రమే ఈ తిరోగమనానికి అడ్డుకట్ట పడవచ్చునని ఆ నివేదిక అంచనా వేసింది. ఆయిల్ దిగుమతుల్లో 23.6 శాతం భారీ వృద్ధి కారణంగా వాణిజ్య లోటు కూడా 1,770 కోట్ల డాలర్లకు చేరినట్టు గణాంకాలు చెబుతున్నప్పటికీ ఆయిల్ దిగుమతుల విషయంలో పెట్రోలియం శాఖ గణాంకాలకు, వాణిజ్య శాఖ గణాంకాలకు మధ్య వ్యత్యాసం ఉన్నట్టు బోఫా ఎంఎల్ ఎకనామిస్ట్ ఇంద్రానిల్ సేన్ గుప్తా అన్నారు. వాస్తవానికి వాణిజ్య శాఖ ఆయిల్ దిగుమతులను 0.5 శాతం ఎక్కువ చేసి చూపిందని ఆయన పేర్కొన్నారు.
2012 ఏప్రిల్-నవంబర్ కాలంలో ఆయిల్ దిగుమతులు 920 కోట్ల డాలర్ల మేరకు ఉన్నట్టు పెట్రోలియం శాఖ గణాంకాలు చెబుతున్నాయంటూ ఈ వ్యత్యాసాన్ని సద్దుబాటు చేసి చూసినట్టయితే వాణిజ్య లోటు గత ఏడాది స్థాయిలోనే ఉన్నదని ఆయన అన్నారు. ప్రస్తుత ద్రవ్యోల్బణ ధోరణులను పరిగణనలోకి తీసుకుంటే వచ్చే మార్చి నాటికి అది ఏడు శాతానికి దిగి రావచ్చునని, జూన్ నాటికి ఆర్‌బిఐ రెపో రేటును 0.75 శాతం తగ్గించే అవకాశం ఉన్నదని తాము భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. మార్చి నాటికి రెపో రేటు 0.25 శాతం తగ్గుతుందని ఆయన అంచనా వేశారు. అయితే ఇటీవల డీజిల్ ధరలను పెంచిన ప్రభావం వల్ల ద్రవ్యోల్బణం ఒక శాతం పెరిగి 8 శాతానికి వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదన్నారు. అయినా ఆర్‌బిఐ 2014 ఆర్థిక సంవత్సరం అంతా నిలకడ విధానం అనుసరించినట్టయితే 2014 మార్చి నాటికి ద్రవ్యోల్బణం 5.7 శాతానికి తగ్గే అవకాశం ఉన్నదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

No comments