ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్న సీమాంధ్ర ప్రజలు
రాష్ట్రంలో సమైక్య, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు జోరందుకున్న సమయంలో
రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఒక సభను ఏర్పాటు చేస్తున్నారు.
"1973లో జై ఆంధ్రా అని నినదించిన వారు నేడు సమైక్యాంధ్ర అని
ఎందుకంటున్నారు'' అన్న అంశంపై చర్చిండానికి వీలుగా దీన్ని ఏర్పాటు
చేస్తున్నారు. ఈ నెల 25 సాయంత్రం 5.30 గంటలకు జరిగే ఈ సమావేశానికి హాజరు
కావాల్సిందిగా ప్రజా ప్రతినిధులందరికీ ఉండవల్లి బుధవారం ఆహ్వానం పంపారు.
40 ఏళ్ల కిందట ఇదే సమయానికి కోస్తా, రాయలసీమ ప్రాంతమంతా 'జై ఆంధ్రా' అంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ తీవ్రతతో ఉన్న విషయాన్ని తన ఆహ్వానంలో ఉండవల్లి గుర్తు చేశారు. నాడు స్కూళ్లూ, కాలేజీలు, వర్సిటీలు, ప్రభుత్వాఫీసులు, బస్సులు, రైళ్లు, సినిమా హాళ్లు అన్ని బంద్ అయ్యాయని పేర్కొన్నారు. విద్యార్థులు 170రోజులు, ఎన్జీవోలు 108 రోజుల పాటు చేసిన సమ్మెలు, హర్తాళ్, రాస్తారోకోలతో నెలల తరబడి ప్రజాజీవనం స్తంభించిపోయిందని ప్రస్తావించారు.
కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో లాఠీ చార్జీలు, అరెస్టులూ, పోలీసు కాల్పులూ జరగని ఊరంటూ లేదంటే అతిశయోక్తి కాదన్నారు. రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో బీకాం చదువుతున్న తాను కూడా అందరిలాగే జైఆంధ్రా ఉద్యమంలో పాల్గొన్నానని ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రెండో తరగతి పౌరులుగా బతకలేమని, 1953లో ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని యథాతథంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వేరు చేయాలని సీమాంధ్ర ప్రజలంతా ముక్తకంఠంతో ఘోషించడాన్ని గుర్తు చేశారు.
నాడు రాష్ట్రంలో పీవీ నరసింహారావు ప్రభుత్వం కూలిపోయి రాష్ట్రపతి పాలన ప్రవేశ పెట్టే వరకూ పరిస్థితులు చేరాయంటే ఉద్యమ తీవ్రతను అర్థం చేసుకోవచ్చన్నారు. 'మీసా' (మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్) ఉపయోగించి, ఎందరో నాయకుల్ని అరెస్టు చేసి వివిధ జైళ్లలో నిర్బంధించారని వివరించారు. 1973 జనవరి 25న నాటి విద్యార్థి ఉద్యమకారుడనైన తనను కూడా అరెస్టు చేసి విశాఖ జైలులో 32 రోజులు ఉంచిన విషయాన్ని పేర్కొన్నారు. 40 ఏళ్ల కిందట ఉవ్వెత్తున ఎగసిన జై ఆంధ్రా ఉద్యమం చివరికి ఎలా ముగిసిందని ప్రశ్నించారు.
ఆనాడు అంతబలంగా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్న సీమాంధ్ర ప్రజలు నేడు రాష్ట్ర విభజనను ఎందుకంత తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారని నిలదీశారు. నాడు మరుగున పడిపోయిన కొన్ని చారిత్రక సత్యాలను జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాని ఉండవల్లి చెప్పారు. 1948లో హైదరాబాద్ రాజ్యం భారత్‌లో విలీనం, 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ, 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 1973లో జై ఆంధ్రా ఉద్యమం, 2013లో ఇరుప్రాంతాల్లో ఉన్న యాధార్థ పరిస్థితులను సమావేశంలో వివరించనున్నట్లుగా తెలిపారు.
రాష్ట్ర చరిత్రలోని అనేక కీలక ఘట్టాలను ఇందులో ఆవిష్కరిస్తానని చెప్పారు. కాగా, 2003 జనవరి 25నాటి రాజమండ్రి సమావేశంలో వలే ఈ నెల 25 జనగనున్న సమావేశంలో కూడా ఒక డిక్లరేషన్‌ను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. 2003 నాటి సమావేశంలో తక్షణమే రెండో రాష్ట్రాల పునర్విభజన కమిషన్ వేయాలని, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రంగాల కింద ప్రభుత్వం కేటాయించిన నిధులు, వ్యయంపై శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు.

No comments