1

Breaking News

రైలు చార్జీల పెంపు

రైలు చార్జీల పెంపు
పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి
బడ్జెట్ కంటే ముందుగానే ప్రకటన
స్లీపర్ నుంచి ఏసీ వరకు అన్నిట్లో పెంపు
రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లకూ వర్తింపు
ప్లాట్‌ఫాం టికెట్లకు మాత్రం మినహాయింపు
పెంచక తప్పదని గతంలోనే చెప్పిన బన్సల్
కిలోమీటరుకు 2 నుంచి 10 పైసలు మేర పెంపు
ఏటా రూ.6,600 కోట్ల అదనపు ఆదాయం

న్యూఢిల్లీ, జనవరి 9: రైలు చార్జీలు పెరిగాయి. స్లీపర్ నుంచి ఏసీ వరకు దాదాపు అన్ని తరగతుల ధరలనూ స్వల్పంగా పెంచుతున్నట్లు రైల్వే మంత్రి పవన్‌కుమార్ బన్సల్ బుధవారం ప్రకటించారు. పెరిగిన చార్జీలు ఈనెల 21వ తేదీ అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయి. ప్లాట్‌ఫాం టికెట్ల ధరలు మాత్రం ఇప్పుడు పెరగలేదు. పదేళ్ల తర్వాత తొలిసారి రైలు చార్జీలు పెంచడం, అది కూడా రైల్వే బడ్జెట్ కంటే నెల రోజులు ముందు పెంచడం విశేషం. అసలే అన్ని నిత్యావసరాల ధరలూ పెరిగి కుదేలవుతున్న సామాన్యులపై ఇది కూడా కొంతమేర భారంగా మారనుంది.

అయితే.. ఈసారి రైల్వేబడ్జెట్‌లో మాత్రం చార్జీలు పెంచేది లేదని బన్సల్ కొద్దిమేర ఊరటనిచ్చారు. చార్జీలు పెంచడం వల్ల సుమారు రూ. 6,600 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి 21 నుంచి మార్చి 31 వరకు రూ. 1200 కోట్లు వస్తాయని బన్సల్ తెలిపారు. అదే సమయంలో సరకు రవాణా చార్జీలు పెరగబోవని మాత్రం ఆయన చెప్పలేదు. తనకంటే ముందు ఈ శాఖను నిర్వహించిన లాలుప్రసాద్, మమతా బెనర్జీల్లా కాకుండా.. ధరలు పెంచక తప్పని పరిస్థితి ఉందని గత అక్టోబర్‌లోనే బన్సల్ ప్రకటించారు.

No comments