మెజార్టీ సమైక్యాంధ్రకే
అసెంబ్లీలో తెలంగాణపై ఎప్పుడు తీర్మానం పెట్టినా మెజార్టీ సమైక్యాంధ్రకే ఉంటుందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆయన విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఎన్టీఆర్ కోరుకున్నారన్నారు. చంద్రబాబు మనసు మార్చుకోవాలన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే హైదరాబాద్, సికింద్రాబాద్‌లో పోటీ చేయాలన్నారు. ఈనెల 28న ఏమీ కాదు, రాష్ట్రాన్ని కేంద్రం విభజించదని ఆయన అన్నారు. పార్లమెంట్ స్థానం నుంచి కేసీఆర్ గెలిస్తే నేను సమైక్యాంధ్ర గురించి మాట్లాడను అని లగడపాటి అన్నారు.
No comments